మాజీ ప్రియుడి‌పై కేసు పెట్టిన అమలాపాల్‌

4 Nov, 2020 11:04 IST|Sakshi

చెన్నై :  తన మాజీ బాయ్‌ప్రెండ్‌గా ప్రచారంలో ఉన్న బాలీవుడ్‌ సింగర్‌ భువ్‌నిందర్‌ సింగ్‌పై నటి అమలా పాల్ ఫిర్యాదు చేశారు. ప్రొఫెషనల్ షూట్‌ కోసం తీసిన ఫోటోలను భువ్‌నిందర్‌ తప్పు అర్థం వచ్చేలా పోస్టు చేసి తన పరువుకు నష్టం కలిగించాడని చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో బాలీవుడ్ సింగర్ భువ్‌నిందర్ సింగ్‌తో పెళ్లి దుస్తుల్లో ఉన్న అమలా పాల్ ఫోటోలను అతను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవి అప్పట్లో నెట్టింట వైరల్‌‌గా మారాయి. కాసేపటికే ఆ ఫోటోలు డిలీట్‌ అయ్యాయి. దీనిపై స్పందించిన నటి అవి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కావని స్పష్టం చేశారు. చదవండి:కట్‌ చెప్పలేదు.. కట్టేసుకున్నారు..!

అక్కడితో ఈ టాపిక్‌ ముగియగా.. తాజాగా ఈ ఫోటోలపై అమాలాపాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. వేరే కారణం కోసం తీసిన ఫోటోలను భువ్‌నిందర్‌ తన అనుమతి లేకుండా ఉపయోగించాడని అమలాపాల్‌ ఆరోపించారు. ఇందుకు అతడిపై పరువు నష్టం దావా వేశారు. అమలాపాల్‌ ఆరోపణలు విన్న న్యాయమూర్తి.. భువ్‌నిందర్‌పై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇచ్చారు. కాగా భువ్‌నిందర్ సింగ్, అమలాపాల్ రహస్యంగా పెళ్లి చేసుకుని విడిపోయారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో భువ్‌నిందర్ ను ఆమె అన్‌ఫాలో చేసిందని టాక్‌. చదవండి: రెండో పెళ్లి చేసుకోలేదు.. అవి ఫోటో షూట్ అంతే

ఇదిలా ఉండగా ఇప్పటికే తమిళ తర్శకుడు ఏఎల్‌ విజయ్‌ను 2014లో ప్రేమించి పెళ్లాడిన అమలా పాల్‌ కొంత కాలానికే అతనితో విడిపోయారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలతో 2017 విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇటీవల వేరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని చెప్పినా.. తన పేరు మాత్రం వెల్లడించలేదు. ఇక అమలాపాల్‌ నటించిన తమిళ చిత్ర అధో ఆంధ పరవై పోలా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. చదవండి: నన్ను నేను తెలుసు కుంటున్నాను


 

మరిన్ని వార్తలు