Amala Paul-Victim: ఓటీటీలో అమలాపాల్‌ విక్టిమ్‌ సిరీస్‌, ఎప్పటినుంచంటే?

3 Aug, 2022 14:18 IST|Sakshi

వినూత్న ప్రయోగాత్మక చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వచ్చిన తరువాత నిర్మాతలకు మరింత లిబర్టీ లభిస్తుందనే చెప్పాలి. దర్శకుల భావాలను స్వేచ్ఛగా ఆవిష్కరించే అవకాశం లభిస్తోంది. ఆ విధంగా రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఒక సరికొత్త ప్రయోగమే విక్టిమ్‌ వెబ్‌ సిరీస్‌. నాలుగు ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ ఆంథాలజీ సిరీస్‌ను నలుగురు ప్రముఖ దర్శకులు రూపొందించడం విశేషం. ఒకే కాన్పెప్ట్‌ను నలుగురు దర్శకులు కలిసి తెరకెక్కించారు. దర్శకుడు వెంకట్‌ ప్రభు కన్ఫెషన్‌ పేరుతోనూ, పా.రంజిత్‌ దమ్మమ్‌ పేరుతోనూ, శింబుదేవన్‌ మొట్టై మాడి సిద్ధర్‌ పేరుతోనూ, ఎం.రాజేష్‌ విరాజ్‌ పేరుతోనూ రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఫైనల్‌గా విక్టిమ్‌ పేరుతో రిలీజవుతోంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా సోమవారం దర్శకులు వెంకట్‌ ప్రభు, పా.రంజిత్, సింబుదేవన్‌ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ముందుగా దర్శకుడు శింబుదేవన్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కాలంలో ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. దానికి రూపమే ఈ వెబ్‌ సిరీస్‌ అని తెలిపారు. దర్శకులు అందరం మాట్లాడుకుని ఒకే కాన్సెప్ట్‌ తమ ఆలోచనల మేరకు రూపొందించాలని అనుకున్నామన్నారు. దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగే సిరీస్‌ అని, ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్‌ అవుతారని పేర్కొన్నారు. పా.రంజిత్‌ మాట్లాడుతూ ఈ కాన్సెప్ట్‌ గురించి తనకు చెప్పగానే తాను నిజ జీవితంలో చూసిన సంఘటనకు దగ్గరగా ఉందని భావించానన్నారు. తాను రూపొందించిన దమ్మమ్‌ ప్లాట్‌ తనను నిజజీవితంలో ఇన్‌స్పైర్‌ చేసిన సంఘటన అని తెలిపారు. కాగా ఇందులో నటుడు ప్రసన్న, ప్రియా భవాని శంకర్, అమలాపాల్, నట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

చదవండి: స్టార్‌ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!
వచ్చే నెల నుంచి కొత్త వీపీఎఫ్‌ చార్జీలు అమలు!

మరిన్ని వార్తలు