Puri Jagannadh:

16 Jul, 2022 10:16 IST|Sakshi

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడంటూ గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌పై ఇటీవల పూరీ తనయుడు, హీరో ఆకాశ్‌ పూరీ క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తలు నిజం కాదని, వాళ్ల అమ్మనాన్న చాలా సంతోషంగా ఉన్నారని చెప్పాడు. అయితే ఆకాశ్‌ పూరీ ‘చోర్‌ బజార్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బండ్ల గణేశ్‌ చేసిన వ్యాఖ్యలు అందరిలో సందేహాలను నింపాయి. 

చదవండి: లలిత్‌ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్‌, వారెవరంటే!

ఇక పూరీ భార్య లావణ్యపై ప్రశంసలు కురిపిస్తూ దేవత లాంటి తల్లికి అన్యాయం చేయొద్దని, కొడుకు మూవీ ఫంక్షన్‌కు కూడా రానంత బిజీగా ఉన్నావా అంటూ పూరీని కడిగిపారేశాడు బండ్ల. ఇక ఆయన మాట్లాడుతుంటే పూరీ భార్య కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. నిజంగానే పూరీ.. భార్యకు విడాకులు ఇస్తున్నాడా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పూరీ-లావణ్యలు విడాకుల వార్తలపై అంబర్‌ పేట్‌ శంకరన్న స్పందించాడు. పూరీ-లావణ్యలది ప్రేమ పెళ్లి అనే విషయం తెలిసిందే. ఇద్దరు ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వారి పెళ్లి జరిపించింది ఈ అంబర్‌ పేట్‌ శంకరన్నే.

చదవండి: ‘దళపతి’ విజయ్‌ కేసును ముగించిన హైకోర్టు

తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆయన పూరీ దంపతుల విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తలన్నీ పుకార్లేనని, వారిద్దరు చాలా సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశాడు. కాగా పూరీ జగన్నాథ్‌, హీరోయిన్‌ చార్మీల మధ్య ఏదో ఉందంటూ చాలాకాలంగా ఏవేవో కథనాలు సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. పూరీ కనెక్ట్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన పూరీ, చార్మీతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ బయట పార్టీల్లో కనిపిస్తుండటంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందని గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేశారు. 

మరిన్ని వార్తలు