మహిళతో సంబంధం, నాలుగో భార్యకు విడాకులు!

21 Apr, 2021 14:25 IST|Sakshi

మలయాళ బుల్లితెర జంట అంబిలి దేవి, ఆదిత్యల వివాహం అప్పట్లో సంచలనమైంది. మూడు పెళ్లిళ్ల తర్వాత ఆదిత్య, మొదటి భర్తకు గుడ్‌బై చెప్పి అంబిలి.. ఇద్దరూ 2019లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై అంబిలి దేవి స్పందిస్తూ.. తానిప్పటికీ ఆదిత్య భార్యగానే బతుకుతున్నానని చెప్పింది.

"ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని అతడిని రెండో పెళ్లి చేసుకున్నా. నేను గర్భం దాల్చేవరకు మా జీవితం సంతోషంగా సాగింది. బెడ్‌ రెస్ట్‌ వల్ల నటనకు బ్రేక్‌ కూడా చెప్పాను. అప్పుడే లాక్‌డౌన్‌ వచ్చిపడింది. ఆ సమయంలో నా భర్త 13 ఏళ్ల కొడుకున్న మహిళతో రిలేషన్‌లో ఉన్నాడని తెలిసింది. మొదట్లో నేను నమ్మలేదు. నా భర్త అలాంటివాడు కాదని బలంగా విశ్వసించాను. తెలిసినవాళ్లు నాకు ఫోన్లు చేసి ఆమె గర్భం దాల్చింది అని చెప్తే దాన్ని కొట్టిపారేశాను".

"కానీ తర్వాత ఎంతోమంది నాకు ఫోన్‌ చేసి మళ్లీ అమ్మవి కాబోతున్నావట.. అంటూ విషెస్‌ చెప్తుంటే అయోమయానికి లోనయ్యాను. కానీ తర్వాత నెమ్మదిగా అంతా అర్థమైంది. అతడి వ్యవహారం బోధపడింది. ఇదే విషయాన్ని నిలదీస్తే అతడు విడాకులు కోరుతున్నాడు. నాకు విడాకులు అక్కర్లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, కలిసే ఉందాం అని చెప్పాను. కానీ అతడు ఆ మహిళే సర్వస్వం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆదిత్య ఇలా ఒక్కసారిగా ఎందుకు మారిపోయాడో అర్థం కావట్లేదు. కలిసుందాం అంటున్నా అతడు లెక్కచేయట్లేదు" అని అంబిలి వాపోయింది.

చదవండి: ప్రేమ వ్యవహారం: టీవీ నటితో వాగ్వాదం.. ముగ్గురి అరెస్టు 

సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ...

మరిన్ని వార్తలు