మాజీ భర్త చెంతకి ఎంజెలీనా జోలి.. విమర్శలు

13 Jun, 2021 12:09 IST|Sakshi

న్యూయార్క్‌: హాలీవుడ్‌ నటి ఎంజెలీనా జోలి తీరుపై ఆమె అభిమానులే మండిపడుతున్నారు ఇప్పుడు. పిల్లల సంరక్షణ విషయంపై ఆమె భర్త బ్రాడ్‌ పిట్‌కి అనుకూలంగా ఈ మధ్య కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులు పట్టించుకోకుండా ఆమె పిల్లల్ని తీసుకుని న్యూయార్క్‌కు చెక్కేసింది. ఈ తరుణంలో బ్రాడ్‌ పిట్‌ తరుపు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించాలని ప్రయత్నిస్తున్నాడు. 

అయితే మొదటి నుంచి జోలి తన భర్త బ్రాడ్‌పిట్‌ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ వస్తోంది. మీడియా మీట్‌లలో బ్రాడ్‌ పిట్‌ పట్ల నిర్లక్క్ష్య వైఖరి, విడాకుల పిటిషన్‌ వంకతో 9మిలియన్‌ డాలర్ల భరణం తీసుకోవడం, తాజాగా పిల్లల కస్టడీకి సంబంధించి డ్రామాతో ఆమె అభిమానులు విసిగిపోయారు. ఈ క్రమంలో బ్రాడ్‌ పిట్‌కు మద్ధతు పెరుగుతోంది. బర్త్‌ డే పార్టీ పేరుతో తండ్రికి పిల్లల్ని దూరంగా తీసుకెళ్లిన జోలిపై హాలీవుడ్‌ మీడియా వెబ్‌ సైట్లతో పాటు ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

మాజీ భర్త చెంతకి..
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలోనే కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఎంజెలీనా మాజీ భర్త జానీ లీ మిల్లర్‌(48)కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందన్న కథనాలు వెలువడుతున్నాయి. బ్రిటిష్‌-అమెరికన్‌ యాక్టర్‌ జానీ లీ ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. శుక్రవారం ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన జోలి.. చాలాసేపు అక్కడే గడిపింది. దీంతో వీళ్లిద్దరూ మళ్లీ ఒక్కటి కాబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ చేష్టలు పిట్‌ను రెచ్చగొట్టడానికేనేమోనని హాలీవుడ్‌ వర్గాల కథనం.

    

కాగా, ఎంజెలీనా, జానీ ఇద్దరూ 1996 మార్చ్‌లో పెళ్లి చేసుకుని.. 18 నెలల తర్వాత విడిపోయారు. అయితే విడాకులు మాత్రం 1999లో తీసుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అమెరికన్‌ యాక్టర్‌ బిల్లీ బాబ్‌ను రెండో పెళ్లి చేసుకుని.. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇక ముచ్చటగా లాంగ్‌రిలేషన్‌ తర్వాత బ్రాడ్‌ పిట్‌ను 2014లో పెళ్లి చేసుకుని.. 2019లో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది ఎంజెలీనా జోలి.

చదవండి: బ్రాంజెలీనా విడిపోవడానికి కారణాలివే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు