రాజ్‌కుంద్రా కేసు: నటికి సమన్లు

26 Jul, 2021 19:33 IST|Sakshi

సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపార వేత్త , శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా  చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే  అశ్లీ చిత్రాల తయారీ, పంపిణీకి సంబంధించి ముంబై  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు సాక్ష్యాలను సేకరించగా, వియాన్ ఇండస్ట్రీస్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులు అందించారు. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్‌ కుంద్రాకు పోర్న్‌ వీడియోల రాకెట్ఖుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్‌ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. రేపు (జూలై 27, ఉదయం 11 గంటలకు) తమ ముందు హాజరుకావాలని  క్రైమ్ బ్రాంచ్  ప్రాపర్టీ సెల్  నోటీసులిచ్చింది.

ఈ కేసుకు సంబంధించి షెర్లిన్‌ చోప్రా స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంటుందని ముంబై క్రైమ్ బ్రాంచ్  పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే కుంద్రా ఉద్యోగులు సమాచారం కీలకంగా భావిస్తున్న పోలీసులు, ఈ వ్యవహారంపై మరింత కూపీ లాగుతున్నారు.  ఈ క్రమంలోనే షెర్లిన్‌ చోప్రా విచారణ అనంతరం పలువురికి సమన్లు జారీ చేసే అవకాశముందని  అంచనా. 

కాగా రాజ్‌ కుంద్రా వ్యవహారంపై సోషల్‌ మీడియా ద్వారాషెర్లిన్ చోప్రా  స్పందించిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్, జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించిన తరువాత షెర్లిన్ చోప్రా మొదటిసారి మౌనం వీడింది. ఈమేరకు ఒకవీడియోను షేర్‌ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెల్‌కు అధికారిక ప్రకటన ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనంటూ..పరోక్షంగా మరో వివాదాస్పద నటి పూనం పాండేపై  ఎటాక్‌ చేసింది. అలాగే తనపై ప్రచారం జరుగు తున్నట్లుగా తాను ఎక్కడకీ పారిపోలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు