కెరీర్‌లో ఫస్ట్‌ బ్రేక్‌ ఇచ్చింది సోనూసూద్‌ భాయే!

28 Dec, 2020 17:52 IST|Sakshi

లాక్‌డౌన్‌లో ఎంతోమంది వలస కార్మికులకు సేవలు అందించి రియల్‌ హీరో అనిపించుకున్న బాలీవుడ్‌ విలన్‌ సోనూసూద్‌ తనకు కెరీర్‌లో ఫస్ట్‌ బ్రేక్‌ ఇచ్చాడని దబాంగ్‌ నటుడు అమిత్‌ సాధ్‌‌ తెలిపాడు. సాయం చేసే గుణం సోనూసూద్‌లో ఇప్పుడే కాదని ఎప్పటి నుంచో ఉందని కొనియాడాడు. ఈ సందర్భంగా సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. కాగా ‘నేం ఆప‌ద్భాంద‌వుడిని కాను’(IAmNoMessiah) అనే పేరుతో సోనూసూద్‌ ఓ పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఇది తన జీవిత కథ అని పేర్కొన్న ఈ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు. సోనూసూద్‌ రాసిన పుస్తకాన్ని ప్రమోట్‌ చేస్తున్న నేపథ్యంలో అమిత్‌ సాధ్‌‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి: 4 సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను: నటుడు

‘సినిమాల్లో నాకు ఫస్ట్‌ బ్రేక్‌ ఇచ్చింది సోనూసూదే. ఇది చాలా మందికి తెలియదు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే సోనూ భాయ్‌ వల్లే. ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్న సోనూ సూద్‌ మంచితనం ఇప్పుడే ప్రారంభించినది కారు. అతను చాలా సంవత్సరాల నుంచే ఇలా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీరు మాకు తిరిగివ్వడానికి ఓ మార్గాన్ని బోధిస్తున్నారు. మీ పుస్తకానికి అభినందనలు’ అని ట్వీట్‌ చేస్తూ పుస్తకాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా అమిత్ సాధ్‌‌ ప్రశంసలకు సోనూసూద్‌ స్పందించారు. ప్రజలకు సహాయం చేసే అదృష్టం తనకు ఉందని సోను సూద్ అన్నారు. ‘భాయ్ మీరు పాలించటానికి పుట్టారు. మీరు మీ స్వంత విధిని రాశారు. మీ అద్భుతమైన ప్రయాణంలో నేను ఉండటం చాలా అదృష్టం. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను బ్రదర్‌. అని రిప్లై ఇచ్చారు. చదవండి: ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో సోనూసూద్‌..


నటుడు అమిత్‌ సాధ్‌

కాగా టీనేజర్‌గా ఉన్నప్పుడు నాలుగుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఇటీవల అమిత్‌ సాధ్‌‌ వెల్లడించిన విషయం తెలిసిందే. 16-18 ఏళ్ల వయసులో నాలుగుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని, అలాంటి ఆలోచనలు లేకపోయినా.. ప్రాణం తీసుకోవాలనిపించిందన్నారు.. అలా కొన్నాళ్ల తర్వాత దేవుడి దయవల్ల ఆ ఆలోచనల నుంచి బయటపడ్డానని వెల్లడించారు. అనంతరం తను చేసే పనుల్లో,  ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందని,  అప్పటి నుంచి తనలో పట్టుదల పెరిగిందన్నారు. అలాంటి ఆలోచనల నుంచి బయట పడటం కేవలం ఒక్కరోజులో జరగిపోలేదని అమిత్ అన్నాడు. దాదాపు 20 ఏళ్లు పోరాడిన తర్వాత, జీవితం ఇంతటితో ఆగిపోకూడని తెలిసిందని చెప్పాడు. జీవితం విలువ తెలుసుకున్న తర్వాత ఆస్వాదించడం మొదలుపెట్టినట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తు తనకంటూ ఓ గుర్తింపు లభించిందని, ఇప్పుడు అలాంటి బలహీనతతో బాధపడుతున్న వారిని చూస్తే జాలి కలుగుతుందని అమిత్ అన్నాడు. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్​లో వచ్చిన 'బ్రీత్: ఇన్​టూ ద షాడోస్' సిరీస్​తో ఆకట్టుకున్నాడు అమిత్.

మరిన్ని వార్తలు