Mouni Roy: మౌనీ రాయ్‌ నా భార్యను చాలా వాడుకుంది.. ఆమెని ఎప్పటికీ క్షమించను: నటుడు

18 Sep, 2021 09:30 IST|Sakshi

Amit Tandon slams Mouni Roy: ప్రముఖ టీవీ నటుడు అమిత్‌ టాండన్‌ నటి మౌని రాయ్‌పై నిప్పులు చెరిగాడు. తను మోసపూరితమైన మహిళ అని తనని ఎప్పటికీ క్షమించనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మౌని రాయ్‌, అమిత్‌ టాండన్‌ ఆయన భార్య రూబీలు మంచి స్నేహితులు. కుటుంబ ఫంక్షన్స్‌కు, విందులు వినోదాలకు తరచూ హజరవుతూ ఉండేవారు.

అలా  ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉండే వీరిమధ్య ఒక్కసారిగా విభేదాలు తలెత్తాయి. అమిత్‌ భార్య రూబీ దుబాయ్‌లో అరెస్టు అయి జైలుకు వెళ్లినప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అప్పటి నుంచి వారు ఎడమొహం పెడమొహంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌ టాండన్‌ మాట్లాడుతూ ఈ విషయంపై నోరు విప్పాడు.

చదవండి: బాలీవుడ్ కుర్ర హీరో కోలీవుడ్‌లో సినిమా చేయనున్నాడా?

ఈ మేరకు అమిత్‌ ‘నా భార్య రూబీ కష్టకాలంలో ఉన్నప్పుడు మౌని రాయ్‌ మొహం చాటేసింది. అందుకే భవిష్యత్తులో తన మొహం అసలు చూడాలనుకోవడం లేదు. తనని నా భార్య చాలా నమ్మింది. కానీ ఆమె తన మనసును ఆమె గాయపరిచింది. మౌనీ నా భార్యను ఉపయోగించుకుంది. కానీ తన అవసరం ఉన్న సమయంలో మౌనీ నా భార్యను వదిలేసింది. ఇది రూబీని తీవ్రంగా బాధించింది. అసలు మౌని రాయ్‌ది ఇలాంటి వ్యక్తిత్వం కాదు. తను చాలా జన్యున్‌ అనుకున్నాం. కానీ నా భార్య రూబీ దుబాయ్‌ జైలులో ఉన్నప్పుడు తన నిజస్వరూపం చూశాం. ఇది మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే తను ఇలాంటి వ్యక్తి కాదని అనుకున్నాం. మాకు తెలిసిన మౌనీ రాయ్‌ కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Shilpa Shetty: 'అమ్మవారి పిలుపు మేరకు దర్శనానికి వచ్చాను'

అలాగే ‘నా భార్య పడిపోయిన క్షణంలో ఆమెను వదలేసింది. కానీ ఇప్పుడు తను మళ్లీ పైకి లేచింది. మునుపటికంటే మరింత ఎదిగింది. ఎందుకంటే నా భార్య తను నిస్వార్థమైన మహిళ. ఇక మా జీవితంలో మౌని రాయ్‌ని క్షమించడమనేది జరగదు. మా తరపు నుంచి ఆమెకు క్షమాపణ అనేది లేదు.  ఒకవేళ తిరిగి తనని జీవితంలోకి రానిస్తే అప్పుడు మళ్లీ నిన్ను వదలిలేస్తానని నా భార్య రూబికి కూడా చెప్పాను’ అంటూ అమిత్‌ వివరించాడు. కాగా అమిత్‌ టాండ్‌న్‌ డెర్మటాలజిస్ట్‌ అయిన రూబిని 2007లో వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు జియాన పుట్టింది. అయితే పలు విభేదాల కారణంగా ఈ జంట 2017లో విడిపోయి మళ్లీ 2019లో కలుసుకున్నారు.

అయితే 2017లో దుబాయ్‌ వెళ్లిన రూబిన అక్కడ కొంతమంది ప్రభుత్వ అధికారులను బెదిరించినందుకు దుబాయ్ హెల్త్ అథారిటీ ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అరెస్టు చేయడంతో 10 నెలల పాటు దుబాయ్ అల్ రఫా జైలులో ఉన్నారు. 2019లో జనవరిలో ఆమె తిరిగి ఇండియాకు వచ్చింది. కాగా ఇండియన్‌ ఐడల్‌ రియాలిటీ షో ద్వారా పాపులర్‌ అయిన అమిత్‌ టాండన్‌ ఆ తర్వాత ‘కైసా యే ప్యార్ హై’లో పృథ్వీ బోస్ పాత్రలో, ‘దిల్ మిల్ గయే’ డాక్టర్ అభిమన్యు మోడీ పాత్రలను పోషించినందుకు ప్రసిద్ధి చెందాడు. ఇక మౌనీ రాయ్‌ ఎక్తాకపూర్‌ నాగిని సీరియల్‌తో నటిగా గుర్తింపు పొందింది.

చదవండి: సమంతే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ లవర్‌.. రీట్వీట్‌ చేసిన సామ్‌

మరిన్ని వార్తలు