ముగ్గురు మిత్రుల కథ

25 Apr, 2021 04:00 IST|Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ నటులు అమితాబ్‌ బచ్చన్, అనుపమ్‌ ఖేర్, బొమన్‌ ఇరానీ కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ‘మైనే ప్యార్‌ కియా’, ‘హమ్‌ ఆప్‌కే ౖహె∙కౌన్‌’, ‘ప్రేమ రతన్‌ ధన్‌ పాయో’ వంటి చిత్రాలను తెరకెక్కించిన సూరజ్‌ బర్జాత్యా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు ‘ఊంచాయీ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని బాలీవుడ్‌ టాక్‌. ముగ్గురి వ్యక్తుల జీవితాల్లోని స్నేహం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం.

‘‘మే డే’ (అజయ్‌ దేవగన్‌ దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న చిత్రం) షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ను కలిశాను. సూరజ్‌ డైరెక్షన్‌లోని సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఓ రోజు అనుపమ్‌ ఖేర్‌ ఫోన్‌ చేసి.. ‘ఇంకా ఏంటి ఆలస్యం.. టీమ్‌లోకి వచ్చెయ్‌’ అన్నారు. అంతే.. నేను కూడా ఈ సినిమా చేయడానికి సిద్ధమైపోయాను’’ అని పేర్కొన్నారు బొమన్‌ ఇరానీ. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రారంభించాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు