ముంబైలో మరో కాస్ట్‌లీ ఇంటిని కొన్న అమితాబ్‌ బచ్చన్!

29 May, 2021 13:29 IST|Sakshi

ముంబై : బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ముంబైలో మరో ఖరీధైన ఇంటికి కొనుగోలు చేసినట్లు ఓ వార్త బీటౌన్‌లో చక్కర్లు కొడుతుంది.  31 కోట్ల విలువైన ఈ ఇంటికి సంబంధించి 2020లోనే రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు 27-28 అంతస్థులు కలిగిన ఈ డూప్లెక్‌ ఇంటిని ప్రముఖ వాణిజ్య సంస్థ  టైర్ -2 బిల్డర్ క్రిస్టల్ గ్రూప్ నుంచి బిగ్‌బి ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 5,184 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో విలాసవంతంగా ఈ ఇంటి నిర్మాణం ఉందని బీటౌన్‌ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఆరు కార్ల పార్కింగ్‌​ కెపాసిటీతో పాటు అనేక సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ముంబైలోని అంథేరి సబర్భన్‌లో అట్లాంటిక్‌ ఏరియాలో ఈ ఇళ్లు ఉందని తెలుస్తోంది. కాగా ఇదే అపార్ట్‌మెంట్‌లో ఇదివరకే బాలీవుడ్‌ ప్రముఖులు సన్నీలియోన్‌, దర్శకుడు  ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ కూడా ఫ్లాట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 16 కోట్లతో సన్నీలియోన్‌ ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయగా, డైరెక్టర్‌ ఆనంద్‌ రాయ్‌ 25 కోట్లతో మరో అపార్ట్‌మెంట్‌ను తీసుకున్నట్లు టాక్‌. ప్రస్తుతం అదే ప్రాంతంలో బిగ్‌బి కూడా ఇంటిని కొనుగోలు చేశారు. ఇప్పటికే ముంబైలో ఆయనకు  ఐదు ఖరీధైన ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన  జుహులో నివాసం ఉంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే  ప్రస్తుతం బిగ్‌బి చెహ్ర్‌, జుండ్‌, మేడే, గుడ్‌ బై చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. రణ్‌బీర్‌, ఆలియా, నాగార్జునతో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 

చదవండి : ఆఫీసు జలమయం, సిబ్బందికి తన దుస్తులిచ్చిన బిగ్‌బీ
ఇంటి రిజిస్ట్రేషన్‌ ఎవరి పేరు మీద చేశారో తెలిస్తే షాకే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు