కేబీసీ: కంటెస్టెంట్‌ జోక్‌కు బిగ్‌బీ ఆగ్రహం

28 Oct, 2020 14:54 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షో తాజా ఎపిసోడ్‌ కంటెస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిన్న (మంగళవారం) జరిగిన ఈ షోలో మధ్యప్రదేశ్‌కు చెందిన కోష్లేంద్ర సింగ్‌ తోమర్‌ కంటెస్టెంట్‌గా వచ్చాడు. హాట్‌ సీటు‌కు వచ్చిన అతడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో షోలో కోష్లేంద్ర 40 వేల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే షోలో గెలుచుకున్న డబ్బును మీ గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారా అని బిగ్‌బీ అడిగాడు. దీనికి అతడు తన భార్య ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయిస్తానని సమాధానం ఇచ్చాడు. దీంతో బిగ్‌బీ ఆశ్చర్యానికి గురై.. వెంటనే ప్లాస్టిక్‌ సర్జరీ ఎందుకోసం అని ప్రవ్నించారు. (చదవండి: ఆస్పత్రిలో చేరిన అమితాబ్; కొడుకు క్లారిటీ)

దీంతో కోష్లేంద్ర.. 15 ఏళ్లుగా తన భార్య మొహం చూసి విసిగిపోయానని చమత్కరించాడు. దీంతో అతడిపై బిగ్‌బీ మండిపడుతూ ఇలాంటి విషయాలు సరదాకి కూడా చమత్కరించ వద్దని క్లాస్‌ తీసుకున్నారు. అయితే చాలామంది తమ అందాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్లాస్టిక్‌ సర్జరీని ఎంచుకుంటారని, కానీ అది రెండు, మూడేళ్లు మాత్రమే పని చేస్తుందన్నారు. ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారన్నారని వివరించారు. అయితే కోష్లేంద్ర ఈ షోలో సమ్మర్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఏకైక భారతీయ మహిళ ఎవరని అడిగిన 40 వేల ప్రశ్నకు సమాధానం ఇచ్చి తదుపరి 80 వేల ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయాడు. (చదవండి: 25 ల‌క్ష‌ల ప్ర‌శ్న‌..ఎమోష‌న‌ల్ అయిన బిగ్‌బి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు