హీరోయిన్‌ గ్లామరస్‌ ఫొటో.. బిగ్‌ బీ కామెంట్‌!

27 Mar, 2021 18:26 IST|Sakshi

ముంబై: సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 1: నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పంజాబీ ముద్దుగుమ్మ కృతి సనన్‌. ఆ తర్వాత హీరోపంటితో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ, దిల్‌వాలే, రాబ్తా, బరేలీ కీ బర్ఫీ వంటి సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుని అక్కడే సెటిలైపోయింది. ఇక పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న యంగ్‌ రెబల్‌స్టార్ ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’లో అతడికి జోడీగా కృతి నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక బచ్చన్‌ పాండే, మిమి, గణపత్‌ వంటి సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
 
కాసేపు సినిమాల విషయాన్ని పక్కన పెడితే.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కృతి సనన్‌కు 38 మిలియన్‌ మంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు మూవీ అప్‌డేట్లతో పాటు, ఫొటోషూట్‌లకు సంబంధించి విశేషాలను పంచుకుంటుంది ఈ పొడుగుకాళ్ల సుందరి. ఈ క్రమంలో శుక్రవారం ఓ గ్లామరస్‌ ఫొటోను షేర్‌ చేసింది ఈ బ్యూటీ. పింక్‌, బ్లూ, గ్రీన్‌, బ్లాక్‌ రంగులతో నిండిన మాక్సీ డ్రెస్‌ ధరించి ఓర చూపులు విసురుతూ హాట్‌లుక్స్‌తో అదరగొట్టింది. ఈ ఫొటోకు ఫిదా అయిన నెటిజన్లు ఇప్పటికే 16 లక్షలకు పైగా లైకులు కొట్టగా, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ సైతం కామెంట్‌ చేయడం విశేషం. వావ్‌ అంటూ ఎరుపు రంగు హార్ట్‌ సింబల్‌ను జతచేశాడు. అలా మొత్తానికి కృతి నిన్న ట్రెండింగ్‌లో ఉందన్న మాట. 

చదవండి: ‘ఆదిపురుష్‌’‌ కోసం తెలుగు నేర్చుకుంటున్న ‘సీత’!

A post shared by Kriti (@kritisanon)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు