ఆ వార్తలు సంతోషాన్నిస్తున్నాయి : బిగ్‌బి

10 Jun, 2021 00:15 IST|Sakshi
అమితాబ్‌ బచ్చన్‌

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల ఏర్పడ్డ పరిస్థితులు కంట్రోల్‌లోకి వచ్చాయని, మళ్ళీ మేకప్‌ వేసుకుని షూటింగ్‌లో పాల్గొనే తరుణం దగ్గర్లోనే ఉందని ఆనందపడుతున్నారు అమితాబ్‌ బచ్చన్‌. తాజా కోవిడ్‌ పరిస్థితులపై అమితాబ్‌ స్పందిస్తూ – ‘‘ఢిల్లీ, మహారాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గాయని వస్తున్న వార్తలు సంతోషాన్నిస్తున్నాయి. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులను శుభ్రపరచుకోవడం వంటి కరోనా నియంత్రణ చర్యల్లో నిర్లక్ష్యం ప్రదర్శించకండి. వ్యాక్సిన్‌ వేయించుకోండి’’ అన్నారు. ఇక తాను నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘గుడ్‌ బై’ గురించి మాట్లాడుతూ– ‘‘గుడ్‌ బై’ షూటింగ్‌లో పాల్గొనడానికి మా టీమ్‌కి వెల్‌కమ్‌ చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఆల్రెడీ మా యూనిట్‌లోని అందరికీ నిర్మాతలు వ్యాక్సిన్‌ వేయించారు. అలాగే షూటింగ్‌లో పాల్గొనేవారికి కోవిడ్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు’’ అన్నారు. వికాస్‌ బాల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు