నాన్న కంటతడి పెట్టడం అదే ప్రథమం: సూపర్‌ స్టార్‌

9 Jan, 2021 14:19 IST|Sakshi

బిగ్‌ బీ రికార్డు.. ట్విట్టర్‌ ఫాలోవర్స్‌@45 మిలియన్స్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. కుటుంబం, వర్క్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంటారు. అప్పుడప్పుడు త్రో బ్యాక్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ.. దాని వెనక ఉన్న జ్ఞాపకాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటారు బిగ్‌ బీ. తాజాగా ఇలాంటి ఫోటోని ఒకదాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు సీనియర్‌ బచ్చన్‌. దీనిలో అమితాబ్‌ తన తండ్రి హరివంశరాయ్‌ బచ్చన్‌ ఆశీర్వాదం కోసం వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు. పక్కనే నిల్చున్న చిన్నారి జూనియర్‌ బచ్చన్‌ తండ్రిని ఆస్తకిగా గమనిస్తుండటం ఈ ఫోటోలో చూడవచ్చు. అయితే తొలుత ఈ ఫోటోని ఓ అభిమాని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దాన్ని అమితాబ్‌ తన ఖాతాలో షేర్‌ చేస్తూ.. దీని వెనక గల కథను అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే..)

ఈ మేరకు అమితాబ్‌ ‘కూలీ షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదంలో నేను చావు అంచుల వరకు వెళ్లాను. అదృష్టవశాత్తు కోలుకుని ఇంటికి చేరుకున్నాను. ఆ సమయంలో మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవడం కోసం వంగి ఆయన  పాదాలకు నమస్కరించాను. ఆ సమయంలో నన్ను చూసి నాన్నగారు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. నాన్నను అలా చూడటం నా జీవితంలో అదే మొదటిసారి. ఇక పక్కనే ఉన్న అభిషేక్‌ మమ్మల్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు’ అంటూ ఈ ఫోటో వెనక గల స్టోరిని ట్వీట్‌ చేశారు.. ఇక తాజాగా శనివారం బిగ్‌ బీ మరో రికార్డు సృష్టించారు. సీనియర్‌ బచ్చన్‌ ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ సంఖ్య శనివారం నాటికి 45 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు