ఆ డాక్యుమెంట‌రీ పేరు చెప్ప‌ను: అమితాబ్

11 Aug, 2020 10:09 IST|Sakshi

ముంబై :  బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇటీవ‌ల కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సోషల్‌ మీడియాలో తరచూ పోస్టులు పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటున్నారు. క‌రోనా సోకిన స‌మ‌యంలో ఆసుప‌త్రిలో త‌న దిన‌చ‌ర్య ఎలా గ‌డిచిందో వివ‌రిస్తూ.. 'నా గురించి నేనే ఆలోచించాను. పాత క్రికెట్ మ్యాచ్‌లు, ఒక డాక్యుమెంట‌రీ (పేరు చెప్ప‌ను), మొబైల్ ఫోన్ గురించి తెలుసుకోవ‌డానికి కొంత స‌మ‌యం వెచ్చించాను. ట్విటర్‌లో కొంత స‌మ‌యం గ‌డిపాను. త‌రుచుగా మందులు వేసుకోవ‌డం, విశ్రాంతి తీసుకున్నాను' అంటూ త‌న దిన‌చ‌ర్య‌ను వివ‌రిస్తూ ట్వీట్ చేశారు. జూలై నెల‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ స‌హా అభిషేక్, ఐశ్వ‌ర్యారాయ్, ఆరాధ్య‌ల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో నానావ‌తి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందారు. వారంతా ఇటీవ‌ల  పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన‌ విషయం తెలిసిందే. (నాపై గౌర‌వం పోయినా స‌రే, నేను ఇంతే)

ఇక 65 ఏళ్లపైబడిన వారు అవుట్‌ డోర్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు వీలు లేదని మహరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల‌ను ఉద్దేశిస్తూ.. తనకు ఇక  ఉద్యోగం దొరుకుందో లేదో అంటూ బిగ్‌బీ సరదాగా పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి ఆయ‌న అభిమాని ఒక‌రు అమితాబ్‌కు ఉద్యోగ అవకాశం ఇస్తున్నట్లు ఓ ఆఫర్‌ లెటర్‌ను అమితాబ్  పోస్టుకు ట్యాగ్‌ చేశాడు. దీనికి అమితాబ్‌.. ‘ఊహించని రీతిలో నాకు ఉద్యోగం వచ్చింది’ చూడండి అంటూ ఆ లేటర్‌ను పంచుకున్నారు. ఇందులో ‘‘ప్రియమైన మిస్టర్ అమితాబ్‌... కొన్ని కారణాల వల్ల ప్రత్యామ్నాయంగా మీకు ఉద్యోగం ఇచ్చేందుకు మీ దరఖాస్తు తాత్కాలికంగా సమీక్షలో ఉందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము’’ అని ఉంది. (బిగ్‌ బీకి జాబ్‌ ఆఫర్‌ ఇచ్చిన ఫ్యాన్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా