బిగ్‌బీ పోస్టుకు కత్రినా కైఫ్‌ ఫ్యాన్స్‌ ఫిదా!

25 Oct, 2020 17:48 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తాజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు బాలీవుడ్‌ బామా కత్రినా కైఫ్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. కత్రినా, బిగ్‌బీలు కలిసి చేసిన ఓ యాడ్‌కు సంబంధించిన ఫొటోను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ బిగ్‌బీ చమత్కరించారు. ఈ ఫొటోలో అమితాబ్‌ బచ్చన్‌, కత్రినాలు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. ‘అనుకోకుండా ఓ ఫొటో నా కంటపడింది. అయితే నేను దానికి కోసం వేతకలేదు. కానీ ఈ ఫొటో దేవీ జీ ఆభరణాలతో చాలా అందంగా కనిపించారు, ఇక్కడ కింద కూర్చున్నది నేనే’ అంటూ బిగ్‌బీ చమత్కరిస్తున్న రెండు ఎమోజీలను జత చేసి పోస్టు చేశాడు. (చదవండి: ప్రభాస్‌ మూవీకి బిగ్‌బీ అంత తీసుకుంటున్నాడా?)

अचानक हमें एक तस्वीर मिल गयी है, ढूँढा नहीं हमने ,पन्ना पलटते मिल गयी है; सोचा, देवी जी गहनों में अच्छी लग रही हैं , नीचे बैठे मान्यवर, हमी हैं , हमी हैं 😜🤣

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

కాగా కత్రినా పెళ్లి కూతురిగా బిగ్‌బీ దంపతులుగా ఓ ఆభరణాల సంస్థ కోసంస చేసిన ప్రకటన నుంచి తీసుకున్న ఫొటో ఇది. అయితే అమితాబ్‌, కత్రినాలు థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌లలో కలిసి నటించిన విషయం తెలిసిందే. చివరిగా గులాబో సితాబోలో నటించిన ఆయన రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌లు జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్రాలో నటిస్తున్నారు. అంతేగాక నాగ్‌ ఆశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, దీపికా పదుకొనెలు హీరోహీరోయిన్‌లు రూపొందిస్తన్న ఆదిపురుష్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు