నోరు తెరిచి చూస్తుంది ఎవరనుకుంటున్నారు?

19 Jan, 2021 15:46 IST|Sakshi

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ లేటెస్ట్‌గా ఓ పాత ఫొటోను షేర్‌ చేశారు. అందులో ఆయన మొట్టమొదటిసారిగా 'మిస్టర్‌ నట్వర్‌లాల్'‌ చిత్రంలో పాట పాడేందుకు సిద్ధమవుతున్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ ఫొటోలో సంగీత దర్శకుడు రాజేష్‌ రోషన్‌ అమితాబ్‌ సరిగా పాడగులుగుతున్నాడా? లేదా? అన్నట్లుగా నిశితంగా పరిశీలిస్తున్నారు. బిగ్‌బీ మాత్రం తన ఫోకస్‌ అంతా లిరిక్స్‌ మీద పెట్టినట్లు కనిపిస్తున్నారు.

అంత తీక్షణంగా చూస్తుంది ఎవరు?
అయితే అమితాబ్‌ తొలిసారి పాడుతున్నందుకో, లేదా? అక్కడేం జరుగుతుందో అర్థం కాకనో కానీ కుర్చీ మీద కూర్చున్న ఓ బుడ్డోడు మాత్రం నోరు తెరిచి అమితాబ్‌నే చూస్తున్నాడు. ఇంతకీ అతడెవరునుకుంటున్నారు.. ఆలిండియా అందగాడు హృతిక్‌ రోషనే. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా‌ తన పోస్టు ద్వారా వెల్లడించారు. 'తొలిసారిగా నేను మిస్టర్‌ నట్వర్‌లాల్‌ సినిమాలో 'మేరే పాస్‌ ఆవో మేరీ దోస్త్‌' పాట పాడాను. ఈ రిహార్సల్స్‌ అక్కడ బెంచీ మీద కూర్చున్న హృతిక్‌ రోషన్‌ పర్యవేక్షణలో జరిగాయి' అంటూ ఫన్నీ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. మిస్టర్‌ నట్వర్‌లాల్‌ సినిమా విషయానికొస్తే అమితాబ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రేఖ కథానాయికగా మెరిశారు. అజిత్‌, కదేర్‌ ఖాన్‌, అంజద్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషించారు. (చదవండి: ఇండస్ట్రీలో నెంబర్‌ 1 అవుతాడనుకున్నారు.. కానీ..)

కలిసి నటించినవి రెండే..
కాగా ప్రస్తుతం బిగ్‌బీ చేతిలో బ్రహ్మాస్త్ర, ఝండ్‌ చిత్రాలున్నాయి. అటు హృతిక్‌ రోషన్‌.. సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందిస్తున్న ఫైటర్‌ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఇక ఇప్పటివరకు బిగ్‌బీ, హృతిక్‌ కేవలం రెండు సినిమాల్లోనే కలిసి నటించారు. 2001లో వచ్చిన 'కభీ ఖుషీ కభీ ఘమ్'‌లో అమితాబ్‌ వ్యాపారవేత్తగా, హృతిక్‌ ఆయన కొడుకుగా నటించారు. 2004లో వచ్చిన 'లక్ష్య' సినిమాలో వీళ్లిద్దరూ ఆర్మీ జవాన్లుగా నటించారు. ఇందులో బిగ్‌బీ హృతిక్‌కు సీనియర్‌గా దర్శనిమస్తారు. (చదవండి: అదే జరిగితే మెగా అభిమానులకు పండగే)

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

మరిన్ని వార్తలు