అగ‌స్త్య‌ నందాను అన్‌ఫాలో చేసిన సుహానా

28 Oct, 2020 17:34 IST|Sakshi

బిగ్‌బి మ‌నువ‌డు అగ‌స్త్య సినిమాల్లోకి రానున్నాడా?

అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌నువ‌డు అగ‌స్త్య నందా పేరు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో అత‌ను బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడా అని అనుకుంటే మాత్రం మీరు పొర‌బ‌డిన‌ట్లే. రెండు రోజుల క్రిత‌మే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన అగ‌స్త్యకు అప్ప‌డే దాదాపు 48 వేల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. వీరిలో అమితాబ్, అభిషేక్ బ‌చ్చ‌న్, ఆలియా భ‌ట్, కరిష్మా కపూర్ స‌హా  ప‌లువురు స్టార్ న‌టీన‌టులు ఉన్నారు. అయితే ఇటీవ‌లే అతడున పోస్ట్ చేసిన‌ వ‌రుస ఫోటోలు, వాటికి వ‌చ్చిన కామెంట్లతో అగ‌స్త్య పేరు తెగ ట్రెండ్ అవుతోంది. (కేబీసీ: కంటెస్టెంట్‌ జోక్‌కు ఆగ్రహించిన బిగ్‌బీ )

చిన్న‌నాటి ఫోటోలు స‌హా  అగ‌స్త్య ఇప్ప‌టి వ‌ర‌కు 12 పోస్టుల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు. వాటిలో ఓ ఫోటోకు సంబంధించి షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ స్పందిస్తూ అన్‌ఫాలో అని కామెంట్ చేయడం ఇప్పుడు బీటౌన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. చిన్నప్పటి నుంచి వీరిద్ద‌రు మంచి ఫ్రెండ్స్ కాగా సుహానా అన్‌ఫాల్ ఎందుకు చేసిందంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఇక మ‌రో పోస్టులో నేను కృషిని  న‌మ్ముతాను కానీ అదృష్ణాన్ని కాదంటూ అగ‌స్త్య  ఓ ఫోటో షేర్ చేయ‌గా అస‌లు నీ  ఉద్దేశం ఏంటో వివ‌రించాలంటూ సోద‌రి న‌వ్యా నందా, ఆలియా భ‌ట్ కామెంట్ చేయ‌డంతో అగ‌స్త్య పేరు మళ్లీ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక శ్వేతనందా,  నిఖిల్ నందా కుమారుడైన అగ‌స్త్య ఇటీవ‌లే లండ‌న్‌లోని సెవెనోక్స్ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు. (భాయ్‌ ‘మన్నత్’‌ను అమ్మేస్తున్నారా.. షారుఖ్‌ రిప్లై!  )

A post shared by Agastya Nanda (@agastya.nanda) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా