కోహ్లి కూతురిపై అమితాబ్ ట్వీట్ వైర‌ల్‌

14 Jan, 2021 13:56 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌‌ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మకు సోమవారం పండంటి పాప జన్మించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపాడు. దీంతో సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు విరుష్క జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బ‌చ్చ‌న్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌న క్రికెట్ టీమ్ అంతా క‌లిసి భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తోందంటూ బిగ్ బీ ఫన్నీ ట్వీట్ చేశాడు. ఇందులో క్రికెట‌ర్లంద‌రికీ కూతుళ్లే పుట్టారంటూ వ‌రుస‌గా ఒక్కొక్క‌రి పేరు రాసుకుంటూ వెళ్లాడు. ధోనీ కూతురు ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ఉంటుందేమో అని కామెంట్ చేశాడు. ఆ లిస్ట్‌లో వ‌రుస‌గా రైనా, గంభీర్‌, రోహిత్‌, ష‌మి, ర‌హానే, జ‌డేజా, పుజారా, సాహా, భ‌జ్జీ, న‌ట‌రాజ‌న్‌, ఉమేష్ యాద‌వ్‌ల పేర్లు ప్రస్తావించాడు. తాజాగా కోహ్లికి కూడా కూతురే పుట్టిందంటూ.. వీళ్లంతా భ‌విష్య‌త్తు మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తున్నార‌ని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై అభిమానులు సరాదాగా స్పందిస్తున్నారు. చదవండి: మా ఫొటోలు తీసుకోండి.. కానీ‌: విరుష్క

ఆ అర్హత ఆయనకు లేదు : బిగ్‌బీకి ఎదురుదెబ్బ 

ఇదిలా ఉండగా పాప పుట్టిన వార్తను తెలియజేసిన కోహ్లి తన ఫోటోను మాత్రం పంచుకోలేదు. ఈ నేపథ్యంలో విరుష్కల కూతురు ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లి సోదరుడు వికాస్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫోటో చూసి అందరూ ఆమె కోహ్లి కూతురని అభిప్రాయపడ్డారు. కానీ ఆ తర్వాత ఆ ఫోటో విరుష్క కూతురిది కాదని వికాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. మరోవైపు తమ చిన్నారి ఫోటోలు తీయవద్దని కోహ్లి- అనుష్క కోరుతున్నారు. ‘‘మాకు సంబంధించిన ఫొటోలు తీసుకోండి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మా చిన్నారి ఫొటోలు తీయవద్దు. మా ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. థాంక్యూ’’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: ఒకే రోజు తల్లులైన అనుష్క, బబిత

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు