స్టార్‌మాలో సరికొత్త సీరియల్‌.. "అమ్మకు తెలియని కోయిలమ్మ"

19 Jul, 2021 10:52 IST|Sakshi

విలక్షణమైన కథలు, వినూత్నమైన కథనాలతో ప్రేక్షకులకు విభిన్నమైన ధారావాహికలను అందిస్తున్న స్టార్ మా.. ఇప్పుడు మరో సరికొత్త కథని సీరియల్ గా అందిస్తోంది. ఆ కథ పేరు "అమ్మకు తెలియని కోయిలమ్మ". అనుబంధాల మధ్య సంఘర్షణ, ఆప్యాయతల మధ్య దూరాలు పెరిగి ఎవరి కథ ఎలా షాక్ ఇవ్వబోతోంది ? ఎవరి కథ ఎందుకలా అయింది ? అసలు ఎందుకు ఇలా జరిగింది ? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం "అమ్మకు తెలియని కోయిలమ్మ". అమ్మకీ కోయిలమ్మకీ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో .. అనుబంధాల  ఆధారంగా విశ్లేషించే కథ ఇది.

తెలుగు సినిమాల్లో ఎన్నో ముఖ్యమైన కేరక్టర్స్ చేసిన మంజు భార్గవి ఈ కథలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ నటులు చిన్నా, వినోద్ బాల, అశ్వని గౌడ  ముఖ్యమైన కేరక్టర్స్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్ గా కావ్యశ్రీ నటిస్తున్నారు. జులై 19 న రాత్రి 9.30 గంటల నుంచి స్టార్ మా లో  ప్రసారమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టార్ మా ప్రేక్షకుల్ని అలరించబోతోంది.

మరిన్ని వార్తలు