పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్​.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం

6 Jun, 2022 17:10 IST|Sakshi

Is Amy Jackson Confirms Her Relationship With Ed Westwick: ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే బ్యూటీఫుల్​ హీరోయిన్​ అమీ జాక్సన్. కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్‌ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్‌ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు. 

అయితే అమీ జాక్సన్‌ బ్రిటీష్‌ నటుడు ఎడ్‌‌వెస్ట్విక్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఏనాడు రియాక్ట్​ కాలేదు అమీ. ఇదివరకు లండన్​లో అతనితో చెట్టాపట్టాలేసుకోని తిరిగిన ఫొటోలు వారు ప్రేమలో ఉన్నారని చెప్పకనే చెప్పినట్లైంది. తాజాగా ఎడ్​వెస్ట్విక్​తో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్​ అయిన ఈ ఫొటోలు చూస్తుంటే వారు ప్రేమలో ఉందన్న వార్తలు దాదాపు కన్ఫమ్​ అయినట్లు తెలుస్తోంది. 

చదవండి: ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్​

A post shared by Amy Jackson (@iamamyjackson)

మరిన్ని వార్తలు