మూడు సినిమాలు ప్రకటించిన ఆనంద్‌ దేవరకొండ

16 Mar, 2021 08:30 IST|Sakshi

‘దొరసాని’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్నారు విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ. అతని పుట్టినరోజు సందర్భంగా సోమవారం మూడు సినిమాలను ప్రకటించారు. ‘మధురా’ శ్రీధర్‌ రెడ్డి, బలరామ్‌ వర్మ నంబూరి, బాల సోమినేని నిర్మాతలుగా రూపొందనున్న సినిమాలో ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తారు.

అలాగే కేదారం సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉదయ్‌ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కమిట్‌ అయ్యారు. ఈ రెండు సినిమాలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌లో ఆనంద్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. మరోవైపు ప్రస్తుతం ఆనంద్‌ నటిస్తున్న ‘పుష్పకవిమానం’ చిత్రంలోని ‘సిలకా’ అనే పాట కూడా పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది.

చదవండి: వివాదాస్పద 'బాంబే బేగమ్స్‌' అసలు కథేంటి..?

మరిన్ని వార్తలు