Anand Devarakonda: 'గంగం గణేశా' టీజర్ వచ్చేసింది.. మీరు చూశారా?

15 Sep, 2023 21:14 IST|Sakshi

బేబీ సక్సెస్ తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటిస్తోన్న చిత్రం గంగం గణేశా. ఈ మూవీ ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కేదర్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ టీజర్‌ను రీలీజ్ చేశారు మేకర్స్. 

(ఇది చదవండి: ఆనంద్ దేవరకొండ 'బేబీ' ముూవీ.. ఫస్ట్ సింగిల్ రిలీజ్)

టీజర్‌ చూస్తే.. 'అమ్మాయిలను టీజ్ చూస్తే పెదాలపై నవ్వు రావాలి కానీ.. కళ్లలో నుంచి నీళ్లు రాకూడదురా' అనే డైలాగ్‌లో ప్రారంభమైంది. బేబీ మూవీ తర్వాత ఆనంద్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వినాయకచవితి సందర్భంగా టీజర్‌ను రిలీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా  తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో నయన్ సారిక, ఇమ్మానుయేల్, వెన్నెల కిశోర్, రాజ్‌ అర్జున్, సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. 

మరిన్ని వార్తలు