ఆనంద్‌ దేవరకొండతో హైవే ప్రయాణం

7 May, 2021 00:53 IST|Sakshi
కేవీ గుహన్, ఆనంద్‌ దేవరకొండ, వెంకట్‌ తలారి, వీరభద్రం, గాదరి కిశోర్‌కుమార్‌

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవీ గుహన్‌ ‘118’ చిత్రంతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆనంద్‌ దేవరకొండ హీరోగా ‘హైవే’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై వెంకట్‌ తలారి నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆనంద్‌ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఎం. వీరభద్రం కెమెరా స్విచ్చాన్‌ చేయగా, తుంగతుర్తి ఎంఎల్‌ఎ గాదరి కిశోర్‌కుమార్‌ క్లాప్‌ కొట్టారు.

ఈ సందర్భంగా వెంకట్‌ తలారి మాట్లాడుతూ – ‘‘చుట్టాలబ్బాయి’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత మా బేనర్‌లో చేస్తోన్న రెండో చిత్రమిది. హైవే నేపథ్యంలో ఒక సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. జూన్‌ మొదటి వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ దాదాపు పూర్తయ్యింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎంపిక జరుగుతోంది’’ అన్నారు కేవీ గుహన్‌. ‘‘గుహన్‌గారి దర్శకత్వంలో సినిమా చేస్తుండటం చాలా సంతోషం. ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు ఆనంద్‌ దేవరకొండ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్‌ కె. కింగ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు