Highway Movie: ఆకట్టుకుంటోన్న ఆనంద్ దేవ‌ర‌కొండ‌`హైవే` కాన్సెప్ట్ పోస్ట‌ర్స్‌

2 Dec, 2021 19:08 IST|Sakshi

Anand Deverakonda Highway Concept Poster: 'పుష్ప‌క విమానం' సినిమాతో మంచి విజ‌యం సాధించాడు యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ. ఆయ‌న హీరోగా కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ `హైవే`. ఈ సినిమాలో పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు ఆనంద్. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జీ కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. తాజాగా న‌టీన‌టుల‌ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ రిలీజయ్యాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్‌ తలారి మాట్లాడుతూ.. ‘‘118 వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ, మాన‌స రాధా కృష్ణ‌న్ హీరో హీరోయిన్లుగా హైవే చిత్రం రూపొందుతోంది. మా బ్యాన‌ర్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెర‌కెక్కించాం. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు చివ‌రిదశ‌లో ఉన్నాయి`` అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ – ‘‘ఒక‌రితో ఒక‌రికి సంబంధం లేని న‌లుగురు వ్య‌క్తుల క‌థే  `హైవే’.  పూర్తిగా హైవే నేప‌థ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌.  టెక్నిక‌ల్ ప‌రంగా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటుంది`` అన్నారు.

మరిన్ని వార్తలు