ఆనంద్‌ దేవరకొండ సినిమాకు హీరోయిన్‌గా ప్ర‌గ‌తి శ్రీవాస్త‌వ‌.. బేబీకి నో ఛాన్స్‌

30 Aug, 2023 14:18 IST|Sakshi

బేబీ సినిమా సక్సెస్‌తో ఆనంద్ దేవరకొండకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఆనంద్‌ మార్కెట్‌ కొంతమేరకు పెరిగింది. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాతో ఒక చిత్రానికి ఆనంద్‌ సంతకం చేశాడు. ఈ సినిమాను  ఏఆర్ మురుగదాస్ టీమ్‌ నుంచి ఒక కొత్త డైరెక్టర్‌ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

ఈ సినిమాకు హీరోయిన్‌గా సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన ఢిల్లీ బ్యూటీ ప్ర‌గ‌తి శ్రీవాస్త‌వ‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’తో తన జర్నీని స్టార్ట్‌ చేసిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఇది విడుదల కాకముందే ఈ బ్యూటీకి మరో క్రేజీ సినిమాను కైవసం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌లోకి ఆనంద్ దేవరకొండతో పాటు ప్ర‌గ‌తి శ్రీవాస్త‌వ‌ కూడా అడుగుపెట్టబోతుంది.

(ఇదీ చదవండి: అతను అలా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి)

బేబీ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆనంద్ దేవరకొండ మరింత జాగ్రత్త పడుతున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ఆయన డీల్‌ కుదుర్చుకున్నాడు. ఆనంద్ జ్ఞానవేల్ రాజా,  మైత్రీ మూవీ మేకర్స్ లాంటి రెండు పెద్ద ప్రొడక్షన్స్‌లలో ఆనంద్‌కు ఒకేసారి ఛాన్స్‌ దక్కడంతో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

కానీ బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యతో ఆనంద్‌ మరో సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని బట్టి చూస్తే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఒక సినిమాకు హీరోయిన్‌గా ప్రగతి శ్రీవాస్తవ ఎంపిక దాదాపు జరిగిపోయింది. ఇక మిగిలి ఉండేది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే ... అందులోనైనా ఆమెకు అవకాశం దక్కుతుందేమో వేచి చూడాలి. బేబీ సినిమా హిట్‌ కావడం వెనుక వైష్ణవి చైతన్య నటన ఎంతో బలం చేకూర్చింది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. 

మరిన్ని వార్తలు