సోడాల శ్రీదేవీగా ఆనంది..ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

30 Jul, 2021 21:16 IST|Sakshi

సుధీర్‌బాబు హీరోగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 80ల నాటి అమలాపురం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం​ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు హీరోయిన్‌ను రివీల్‌ చేయలేదు చిత్ర బృందం. తాజాగా ఈ చిత్రంలో జాంబిరెడ్డి ఫేం ఆనంది కథానాయికగా నటిస్తుంది. దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఆమె గోలి సోడా కొడుతూ గ్రామీణ యువతిగా కనిపిస్తుంది.

'ఈ రోజుల్లో'.. 'బస్టాప్' వంటి సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఆనంది..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ బిజీ అయింది. తాజాగా జాంబిరెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఆనంది ఖాతాలో ఇప్పుడు ఈ చిత్రం కూడా చేరింది. కాగా 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 

మరిన్ని వార్తలు