రహస్యాలు ఏంటి? 

5 Aug, 2023 01:18 IST|Sakshi

‘మల్లేశం’ చిత్రం ఫేమ్‌ అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర చేస్తున్న చిత్రం ‘తంత్ర’. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పి. నరేష్‌ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ‘‘హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘తంత్ర’. భారత తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు