Ananya Panday : షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌కు డ్రగ్‌ డీలర్లతో లింకులు?

21 Oct, 2021 17:21 IST|Sakshi

ఎన్సీబీ విచారణకు తండ్రితో కలిసి హాజరైన అనన్య

Ananya Pandays Mobile, Laptop Seized : బాలీవుడ్‌ ఇండస్ట్రీని డ్రగ్స్‌ కేసు కుదిపేస్తుంది. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్‌ అనన్య పాండే ఎన్సీబీ ఎదుట హాజరయ్యింది. తండ్రి, నటుడు చంకీ పాండేతో కలిసి ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈరోజు ఉదయం అనన్య ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేశారు. 

ఈనెల 2న జరిగిన క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ కావాలని ఆర్యన్‌.. అనన్యకు వాట్సప్‌ చాట్‌ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చాట్‌లో లైగర్‌ భామ అనన్యతో పాటు ఆర్యన్‌ సోదరి సుహానా ఖాన్‌ కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా స్టార్‌ హీరోల పిల్లలు కావడంతో అందరికి ఓ కామన్‌ వాట్సాప్‌ గ్రూప్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. తెలుగులోనూ విజయ్‌ దేవరకొండ సరసన లైగర్‌ అనే పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తుంది. 

చదవండి: నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్‌!
బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత

మరిన్ని వార్తలు