Aryan Drug's Case: షారుక్‌ నాకు తండ్రిలాంటి వాడు.. వైరల్‌ అవుతున్న పాత ఇంటర్వూ

21 Oct, 2021 17:04 IST|Sakshi

షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ హీరోయిన్‌, ‘లైగర్‌’ భామ అనన్య పాండేని ఎన్‌సీబీ సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌ ఖాన్‌ ఫోన్‌లో ఈ భామతో డ్రగ్స్‌ గురించి చేసిన చాటింగ్‌ బయట పడగా కోర్టు ముందు ఉంచిన ఎన్‌సీబీ విచారణ కోసం ఎన్‌సీబీ ఆఫీసుకి పిలిచింది. ఈ తరుణంలో ఆమె షారుక్‌ గురించి మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ ప్ర​స్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఆ ఇంటర్వ్యూలో.. ‘షారుక్‌ ఆయన నా బెస్ట్ ఫ్రెండ్స్ సుహానా తండ్రి మాత్రమే కాకుండా నాకు మరో తండ్రిలాగా. అందుకే చాలాసార్లు ఆయనతో కలిసి ఎన్నో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వెళ్లాగలిగాం. నేను కలిసి ఎన్నో విచిత్రమైన పనులు చేస్తుంటాం. అయినా షారూక్ మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. మాతో కలిసి ఫొటోషూట్లలో కూడా పాల్గొంటార’ అని తెలిపింది. సుహానా, సంజయ్‌ కపూర్‌ షానయ, నేను క్లోజ్ ఫ్రెండ్స్‌. మేము ముగ్గురం అన్ని విషయాలు షేర్‌ చేసుకుంటామని తెలిపింది.

చదవండి: షారుక్‌, అనన్య పాండే ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

మరిన్ని వార్తలు