3 నిమిషాల పాట కోసం అనసూయకు రూ .20 లక్షలు!

30 Jan, 2021 14:29 IST|Sakshi

బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్‌ అనసూయ భరద్వాజ్..వెండితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సత్తా చాటతుంది. వరుస ఆఫర్లతో జోరు మీదున్న అనసూయ అప్పుడప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌లోనూ తళుక్కున మెరుస్తుంది. తాజాగా`చావు కబురు చల్లగా` సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించడానికి అనసూయ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 3 నిమిషాల నిడివి ఉండే ఈ సాంగ్‌ కోసం అనసూయ అక్షరాలా రూ .20 లక్షలు డిమాండ్‌ చేయగా, చిత్ర బృందం వెంటనే ఓకే చెసినట్లు సమాచారం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్‌ షూట్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు నిర్మిస్తున్నారు.  ఇంతకుముందు సాయి ధరమ్‌తేజ్‌ నటించిన విన్నర్‌  సినిమాలోనూ అనసూయ స్పెషల్‌ సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. (అతడితో ప్రేమలో ఉన్నాను: నటి)

ప్రస్తుతం అనసూయ, నటుడు అశ్విన్‌ విరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం థ్యాంక్‌ యూ బ్రదర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ఓటీటీలో విడుద‌ల‌ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.  కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ మార్తాండ’లో కీలక పాత్రలో నటిస్తున్న అనసూయ..రవితేజ హీరోగా వస్తోన్న ‘కిలాడి’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళంలోనూ విజయ్ సేతుపతితో  జోడీ కట్టే ఛాన్స్‌ కొట్టేసిన అనసూయ వెండితెరపై సెలక్టివ్‌ పాత్రలు పోషిస్తూ దూసుకుపోతుంది. (రకుల్‌ ఫిట్‌నెస్‌ మంత్రా : ఫ్యాన్స్‌ ఫిదా.)
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు