తమన్నా ప్లేస్‌లో అనసూయ, బ్లాక్‌ సూట్‌, హాట్‌ లుక్స్‌తో అదుర్స్‌

23 Oct, 2021 16:17 IST|Sakshi

Anasuya Bharadwaj: బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో యాంకర్లలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్‌. బుల్లితెరపై సుమ తర్వాత అంతటి ఫాలోయింగ్‌, క్రేజీ సంపాదింకున్న యాంకర్‌ అనసూయ మాత్రమే అనడంతో ఎలాంటి అతిశయోక్తిలేదు.

మాటలతోనే కాదు తన అందచందాలతో ప్రేక్షకులను అలరించేతెలుగింటి ముద్దుగుమ్మ యాంకర్‌ అనసూయ. ఈ ఒకవైపు బుల్లితెరపై అలరిస్తూనే..  వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. అయితే వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. బుల్లితెరను మాత్రం వీడేది లేదని తెగేసి చెబుతోంది ఈ హాట్‌ యాంకర్‌. తాజాగా అనసూయ మరో క్రేజీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. 

తమన్నా తొలిసారిగా హోస్ట్‌ వ్యవహరించిన షో `మాస్టర్‌ చెఫ్‌ తెలుగు`. భిన్నమైన వంటల రుచులను తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేయబోతున్న కుకింగ్‌ షో ఇది. జెమిని టీవలో ప్రసారమయ్యే ఈ షోకి ఇన్నాళ్లు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించింది. తాజాగా ఆమె స్థానంలో అనసూయను తీసుకొచ్చారు షో నిర్వాహకులు. 

అయితే తమన్నా హోస్ట్ చేసే ఈ షోకి అంతగా పాపులారిటీ, రేటింగ్‌ రావడం లేదట. దీంతో బుల్లితెరపై క్రేజ్‌ ఉన్న అనసూయని దింపారని తెలుస్తుంది. ప్రతి  శుక్రవారం, శనివారం ప్రసారమయ్యే ఈ షో కోసం అనసూయ ప్రత్యేకంగా రెడీ అవుతున్న అనసూయ.. ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ  బ్లాక్‌ సూట్‌లో దర్శనమిచ్చి కుర్రకారు  మైండ్‌ బ్లాంక్‌  చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు