Anasuya Bhardwaj: నెట్టింట దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్‌.. ఉలిక్కిపడ్డ యాంకరమ్మ

20 Aug, 2022 15:13 IST|Sakshi

యాంకర్‌ అనసూయ చేసిన తాజా ట్వీట్‌ ప్రస్తుతం  నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో తన ట్వీట్స్‌ను రాజకీయం చేయొద్దంటూ అనసూయ నెటిజన్లను వేడుకుంది. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్స్‌ చేసింది. అసలేం ఏం జరిగిందంటే.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ను అనసూయ రీట్విట్‌ చేయడంతో చర్చనీయాంశమైంది. గుజరాత్‌ బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచార కేసులో దోషులుగా ఉన్న ఖైదీలను ఇటీవల జైలు నుంచి విడుదల చేశారు. వారిని ఓ సంస్థ సన్మానం చేసింది.

చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ కౌంటర్‌, వేడి కాఫీలో ముంచేస్తారు

ఈ విషయంపై  మంత్రి కేటీఆర్ సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించేవారు గుజరాత్‌లో ఏం జరుగుతుందో కూడా చూడాలంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది. వెంటనే నెటిజన్లు ఆమెపై ట్రోల్‌ చేస్తూ విరుచుకుపడ్డారు. ‘ఇది దారుణం. మనం స్వేచ్ఛను పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. అంటే రేపిస్టులను విడిచిపెట్టి. మహిళలను ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం’ అంటూ ఆమె రాసుకొచ్చింది.

దీంతో అనసూయ ట్వీట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో మైనర్‌పై అత్యాచారం జరిగినప్పుడు దానిపై ఎందుకు స్పందించలేదని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక సోషల్‌ మీడియా తనపై జరుగుతున్న దాడికి అనసూయ ఉలిక్కిపడింది. దీంతో ఆమె స్పందిస్తూ.. ‘నేను చేసిన ట్వీట్‌ను రాజకీయం చేస్తున్నారు. నేను నా సొంత అభిప్రాయాన్ని చెప్పాను. దీనికి ఎవరితో సంబంధం లేదు. ముఖ్యంగా ఎవరినో ప్రమోట్‌ చేసేందుకు, డబ్బులు తీసుకుని ఈ ట్వీట్‌ చేయలేదు’ అని స్పష్టం చేసింది. 

చదవండి: ఇప్పటికీ నాతో వారు నటించేందుకు సంకోచిస్తున్నారు: నటి ఆవేదన

ఇక మరో ట్వీట్‌లో ‘అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని పూర్తి అవగాహనేతోనే మాట్లాడుతున్నాను. అయినా నా కామెంట్స్‌ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందువల్లే నేను ఓ సొంత నిర్ణయానికి రాలేకపోతున్నాను. దయ చేసిన నా ట్వీట్స్‌ను రాజకీయం చేయకండి’ అంటూ అనసూయ నెటిజన్లను విజ్ఞప్తి చేసింది.  ఇక వివరణపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘అలాంటప్పుడు మీరు రాజకీయ అంశాలకు దూరంగా ఉండండి. మీరు ఒక నటి అనే విషయం గుర్తు పెట్టుకొండి. నటిలా వ్యవహరించండి’ అంటూ సూచించాడు.

మరిన్ని వార్తలు