మా నాన్న పిచ్చి వల్ల ఆస్తి పోయింది: అనసూయ

7 May, 2021 08:26 IST|Sakshi

తెలుగు బుల్లితెర మీద అగ్గిపుల్లలాంటి యాంకర్‌ ఎవరు? అనగానే మరోమారు ఆలోచించకుండా అనసూయ భరద్వాజ్‌ అని టపీమని చెప్తారు. తన మాటతీరు, వేషధారణ, కుటుంబం.. ఇలా తనకు సంబంధించిన ఏ విషయాల్లో జోక్యం చేసుకుని మాట్లాడినా వారిని మాటల తూటాలతో ఎన్‌కౌంటర్‌ చేసి పాడేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ యాంకర్‌ తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాల్యంలో అనుభవించిన కష్టాలను ఏకరువు పెట్టింది.

తాము రిచ్‌గానే పెరిగామని, కానీ ఈ విషయాన్ని ఇంతవరకు ఎక్కడా చెప్పలేదని అనసూయ పేర్కొంది. తమకు గుర్రాలు ఉండేవని, తండ్రికి గుర్రపు రేసులు, గ్యాంబ్లింగ్‌(జూదం) పిచ్చి కూడా ఉండేదని, దీని వల్ల తమ ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిందని తెలిపింది. ఇక గతంలోనూ తన తండ్రి ఎలా పెంచాడో పలు మార్లు మీడియా దగ్గర ప్రస్తావించిన విషయం తెలిసిందే.

తాము స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని తండ్రి మరీ మరీ చెప్పేవారని తెలిపింది. ఆటోవాళ్లతో ఎలా మాట్లాడుతున్నా?, వాళ్లను ఎలా హ్యాండిల్‌ చేస్తున్నాం? అనేది కూడా దూరం నుంచి ఆయన ఓ కంట కనిపెడుతుండేవారని అనసూయ ఆ మధ్య వెల్లడించింది. చిన్నప్పుడు అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని, డబ్బులు సరిపోక బస్టాప్‌ వరకు నడుచుకుంటూ వెళ్లాదన్ని అని వివరించింది. కాగా అనసూయ ముఖ్య పాత్రలో నటించిన 'థాంక్‌ యూ బ్రదర్‌' సినిమా నేటి నుంచి ఆహాలో ప్రసారం కానుంది. టాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్‌లో కలిపి సుమారు 6 ప్రాజెక్టులతో అనసూయ బిజీబిజీగా ఉంది.

చదవండి: యాంకర్‌ అనసూయ భర్త జాబ్‌ ఏంటో తెలుసా?

కరోనా: నటి శ్రీప్రద అకాలమరణం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు