Anasuya Bharadwaj : 9 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. భరద్వాజ్‌ కులమేంటో తెలియదు

21 Sep, 2023 16:44 IST|Sakshi

యాంకర్‌ అనసూయ గురించి అందరికి తెలిసిందే. బుల్లితెరపై గ్లామర్‌ క్వీన్‌గా పేరు సంపాదించి.. ఇప్పుడు వెండితెరపై రాణిస్తోంది. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీ చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. సినిమాల కంటే ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఆమె పెట్టే పోస్టులే ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. ఏ విషయం గురించి అయినా ముక్కు సూటిగా మాట్లాడడం అనసూయకు అలవాటు. తన పర్సనల్‌ విషయాలను కూడా ఓపెన్‌గానే షేర్‌ చేసుకుంటుంది. తాజాగా తన భర్త భరద్వాజ్‌ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసుకుంది. 

9 ఏళ్లుగా ప్రేమలో
అనసూయది ప్రేమ వివాహం. ఇంటర్‌లో ఉన్నప్పుడు భరద్వాజ్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత భరద్వాజ్‌ ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. అయితే అనసూయ వెంటనే ఓకే చెప్పలేదు. ఏడాదిన్నర తర్వాత ఆయన ప్రేమను అంగీకరించింది. 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2010లో వివాహం చేసుకున్నారు. మొదట్లో వీరి వివాహానికి కుటుంబం సభ్యులు ఒప్పుకోలేదు. కానీ ఇద్దరూ పట్టుపట్టి మరీ ఒప్పించారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కొడుకులు. 

భరద్వాజ్‌ కులం ఏంటో తెలియదు: అనసూయ
తొమిదేళ్లుగా ప్రేమలో ఉన్నా.. వీరిద్దరి మధ్య కుల ప్రస్థావన ఒక్కసారి కూడా రాలేదట. లగ్న పత్రిక రాసే ముందు వరకు భరద్వాజ్‌ కులం ఏంటో అనసూయకు తెలియదట. ‘పెద్ద కాపు – 1’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘కుల మతాలను నేను ఎక్కువగా పట్టించుకోను. తొమ్మిదేళ్లు ప్రేమలో ఉన్నప్పటికీ.. భరద్వాజ్‌ కులం ఏంటో నాకు తెలియదు. లగ్న పత్రిక రాసే ముందు గోత్రం, కులం అడిగారు. అప్పుడు ఆయన పలాన కులానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. మేమిద్దరం కులమతాలను పట్టించుకోం’ అని అనసూయ చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు