‘పుష్ప’ సెట్స్‌లో అనసూయ, షూటింగ్‌ లోకేషన్‌ షేర్‌ చేసిన నటి

8 Jul, 2021 17:06 IST|Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఈ మూవీలో బన్ని పుష్పరాజ్‌గా మాస్‌లుక్‌లో అలరించనున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మక మందన్నా హీరోయిన్‌ కాగా.. విలన్‌గా మలయాళ నటుడు ఫహద ఫాసిల్‌ నటిస్తున్నాడు. అలాగే ఇందులో ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పుష్ప షూటింగ్‌ నిలచిపోయింది.

ఇక తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో పాటు ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతినివ్వగా ఇటీవల ‘పుష్ప’ మూవీ తిరిగి సెట్స్‌పైకి వచ్చింది. ఇప్పటికే షూటింగ్‌లో అల్లు అర్జున్‌, రష్మికలు పాల్గొనగా తాజాగా అనసూయ కూడా షూటింగ్‌లో పాల్గొంది. ‘బ్యాక్‌ టూ వర్క్‌’ అంటూ ‘పుష్ప’ షూటింగ్‌ లోకేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. కాగా పుష్ప మూవీ ప్రస్తుతం హైదరబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ గోవా షెడ్యూల్‌ 15 రోజుల పాటు జరుగుతుందని తెలిసింది. సినిమాలోని ప్రధాన తారాగణంపై అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘పుష్ప’ సినిమా తొలి పార్ట్‌ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు