ర‌వితేజతో ర‌చ్చ చేయ‌నున్న అన‌సూయ‌

10 Nov, 2020 20:46 IST|Sakshi

బుల్లితెర మీద యాంక‌ర్‌గా రాణిస్తూనే అవ‌కాశం వ‌చ్చినప్పుడ‌ల్లా వెండితెర మీద కూడా త‌ళుక్కున మెరుస్తోంది అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు సుకుమార్‌, హీరో రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'రంగ‌స్థ‌లం' చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించి అంద‌రినీ బుట్ట‌లో ప‌డేసింది. ఆ పాత్ర అన‌సూయ‌కు ఎన‌లేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. వ‌రుస ఆఫ‌ర్లు ఆమె త‌లుపు త‌ట్టాయి. దీంతో ఇటు షోలు చేస్తూ మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తూ బిజీబిజీగా మారిపోయింది. ఇప్ప‌టికే చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ 'ఆచార్య' సినిమాలో కీల‌క పాత్ర‌కు ఓకే చెప్పిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు కృష్ణవంశీ రంగమార్తాండలో కూడా స్పెష‌ల్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. (చ‌ద‌వండి: అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ)

తాజాగా మాస్ మ‌హారాజు ర‌వితేజ 'ఖిలాడీ'లోని ముఖ్య పాత్ర‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు సమాచారం. ‘రాక్షసుడు’ ఫేమ్‌ రమేష్‌ వర్మ తెర‌కెక్కిస్తున్న‌ 'ఖిలాడి' చిత్రం ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్ ఇటీవ‌లే విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న ల‌భించింది. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇందులో అన‌సూయ స్పెష‌ల్ రోల్ చేయ‌డ‌మేకాక‌ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో ర‌వితేజతో క‌లిసి చిందులేయ‌నందుట‌. కాగా అన‌సూయ.. సాయిధ‌ర‌మ్ తేజ్ 'విన్న‌ర్' సినిమాలోని 'సూయ సూయ..' అంటూ వ‌చ్చే ప్రత్యేక‌ పాట‌లో హీరోతో క‌లిసి చిందేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌ను యాంక‌ర్ సుమ పాడ‌టం విశేషం. (చ‌ద‌వండి: షేక్‌ చేస్తున్న శర్వానంద్‌ ‘భలేగుంది బాలా’ సాంగ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా