ఓటీటీలో తక్కువ ధర పలికిన అనసూయ సినిమా

28 Apr, 2021 12:17 IST|Sakshi

యాంకర్‌ అనసూయ నటించిన లేటెస్ట్‌ మూవీ 'థ్యాంక్‌ యు బ్రదర్'‌. ఈ సినిమాతో రమేశ్‌ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశ్విన్‌ విరాజ్‌ హీరోగా నటించగా, అనసూయ గర్భిణిగా నటిస్తోంది. అయితే భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా గోపిచంద్ సీటీమార్, నాగ చైతన్య లవ్ స్టోరి, నాని టక్ జగదీష్, ఇక తాజాగా చిరంజీవి ఆచార్య ఇలా పలు సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరోవైపు చిన్న సినిమాలు మాత్రం ఓటిటిలో విడుదలవుతున్నాయి.

తాజాగా బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'థ్యాంక్‌ యు బ్రదర్'‌ కూడా థియేట్రికల్‌ రిలీజ్‌ను రద్దు చేసుకుంది.ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మే 7న ఆహాలో రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఆహా 1.8 కోట్లకు కొన్నట్లు టాక్. అంటే దాదాపు రెండు కోట్లకు కూడా అమ్ముడుపోలేదు. మొదట థియేటర్‌లో రిలీజైన వారానికే ఓటీటీలో రిలీజ్‌ చేద్దామని భావించింనా పరిస్థితి అనుకూలించకపోవడంలో ఆహాలో డైరెక్ట్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

ఇక అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పుష్పలో నటిస్తుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ యాంకర్‌గానే కాక నటిగానూ సత్తా చాటుతోంది. 

చదవండి : ఇప్పుడీ ఫొటోలు అవసరమా? అనసూయ ఘాటు రిప్లై
అల్లు అర్జున్‌కు కరోనా, ఆందోళనలో ఫ్యాన్స్‌


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు