Anasuya : రిపబ్లిక్​ డే వివాదంలో అనసూయ.. ఫైనల్​గా

26 Jan, 2022 20:52 IST|Sakshi

Anasuya Trolled On Republic Day For Singing National Song: బుల్లితెర యాంకర్​గా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్​ అయింది అనసూయ భరద్వాజ్​. ఓ పక్క గ్లామరస్​ యాంకర్​గా రాణిస్తూనే మరోపక్క వెండితెరపై తళుక్కుమంటుంది. ఇటీవల ఐకానిక్​ స్టార్ అల్లు అర్జున్​ 'పుష్ప' సినిమాలో దాక్షాయణిగా అలరించి మరింత పాపులర్​ అయింది. అలాగే అనసూయ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది. తనకు సంబంధించిన వీడియోస్​, ఫొటోస్​తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అప్పుడుప్పుడు పలు వివాదాలు కూడా అనసూయను పలకరిస్తూ ఉంటాయి. నెటిజన్లు ట్రోల్​ చేయడం, వారికి స్ట్రాంగ్​గా కౌంటర్​ ఇవ్వడం పరిపాటే. 

అయితే తాజాగా రిపబ్లిక్​ డే సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. క్లారిటీ ఇద్దామనుకున్న ట్రోలింగ్​ ఆగట్లేదు. ఇంతకీ అనసూయ చేసిన పని ఏంటంటే.. అనసూయ జాతీయ గేయాన్ని నిలుచుని పాడకుండా కుర్చీలో కూర్చొని పాడింది. జాతీయ గీతం, జాతీయ గేయం ఏదైనా సరే మనం గౌరవిస్తూ ఆ రెండు పాడే సమయాల్లో లేచి నిల్చుంటాం. అనసూయ అలా చేయకుండా కూర్చొని పాడేసరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అలాగే అనసూయ వేసుకున్న టీషర్ట్​ మీద గాంధీ బొమ్మ ఉండటంతో గాంధీ బొమ్మ ఎందుకు వేసుకున్నావ్​.. ఈరోజు అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి గాంధీకి సంబంధం ఏంటని కామెంట్ పెట్టారు. 

ఈ కామెంట్లకు విసిగిన అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఒక యూజర్​ కామెంట్​కు 'లేదు.. నేనే సారీ చెబుతున్నా. ఇదంతా చూస్తుంటే నేను నిల్చోకుండా పాడినందుకు చాలా మంది హర్ట్​ అయినట్టున్నారు.' అలాగే టీ షర్ట్​పై గాంధీ బొమ్మపై వచ్చిన కామెంట్లకు 'అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు. మరి జనగణమణ ఏంది.. ఆగస్ట్​ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడండి. హ్యాపీ రిపబ్లిక్​ డే' అని చెప్పింది అనసూయ. 
 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)


మరిన్ని వార్తలు