సాయం చిత్ర యూనిట్‌కు మంత్రి శుభాకాంక్షలు

21 Jun, 2021 10:12 IST|Sakshi

సాయం చిత్ర యూనిట్‌కు విద్యాశాఖ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. వైట్‌ లాంప్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం సాయం. ఎస్పీ రామనాథం సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంటోని సామి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కథానాయకుడిగా అభి శరవణన్, కథానాయికగా ఇండియా – పాకిస్తాన్‌ చిత్రం ఫేమ్‌ షైనీ నటిస్తున్నారు. సంగీతాన్ని నాగ ఉదయన్, ఛాయాగ్రహణను క్రిస్టోపర్, సలీం అందిస్తున్నారు.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న సాయం చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టరును శనివారం విడుదల చేశారు. ఈ చిత్ర పోస్టర్‌ను నిర్మాత థాను, దర్శకుడు అమీర్, సుశీందర్, సముద్రఖని, రాజేష్, సుబ్రమణియం శివ, ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌ మొదలగు సినీ ప్రముఖులు ఆవిష్కరించారు. చిత్ర యూనిట్‌ శనివారం తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్భిల్‌ మహేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా సాయం చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్‌కు మంత్రి శుభాకాంక్షలు అందించారు. 

చదవండి: Father's Day Special Songs: కంటతడి పెట్టించే ‘నాన్న’ పాటలు విన్నారా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు