యాంకర్‌ అనసూయ భర్త జాబ్‌ ఏంటో తెలుసా?

4 May, 2021 18:30 IST|Sakshi

తెలుగులో టాప్‌ యాంకర్స్‌లో ఒకరిగా వెలుగొందుతోంది అనసూయ భరద్వాజ్‌. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటుతుంది ఈ భామ. స్టార్‌ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే, మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటోందీ రంగమ్మత్త. తన అందంతో ముప్పై పదుల వయసులోనూ క్రేజీ ఆఫర్స్‌ను దక్కించుకుంటూ హీరోయిన్లలకే పోటీ ఇస్తుంది. ప్రస్తుతం తెలుగులో పలు టీవీ షోలు, ఈవెంట్లు చేస్తూనే చేతినిండా సినిమాలతో బిజీగా మరింది. ఇప్పటికే తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ హీరోయిన్లకు సమానంగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటుంది.


ఇదిలా ఉండగా అనసూయది లవ్‌ మ్యారెజ్‌ అని చాలా మందికి తెలిసినా ఆమె భర్త ఎవరు? ఏం చేస్తుంటాడనే విషయం చాలామంది తెలియదు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చిన అనసూయ తన భర్త ఫైనాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా చేస్తున్నట్లు పేర్కొంది. సోషల్‌ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్‌ చూసి మొదట్లో చాలా బాధేసేదని, అయితే తన కుటుంబం ముఖ్యంగా భర్త సపోర్ట్‌ వల్ల వాటిని అధిగమించానని తెలిపింది. తన భర్త నార్త్‌ ఇండియాకు చెందిన వాడు కావడంతో తన అత్తగారింటికి వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలను పాటిస్తానని, అందరిలానే తలపై ముసుగు వేసుకుంటానని వెల్లడించింది. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్‌- సుకుమార్‌ దర్శకత్వంలో వస్తోన్న పుష్పలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి :'వదినమ్మ' సీరియల్‌ నటుడిపై భార్య న్యాయ పోరాటం
యాంకర్‌ రవి కారులో.. సీక్రెట్స్‌ బయటపెట్టేసిన లాస్య

మరిన్ని వార్తలు