యాంకర్‌ అనసూయ అందానికి కారణం ఇదే!

10 Apr, 2021 13:32 IST|Sakshi

ప్రముఖ యాంకర్‌ అనసూయ.. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తను చేస్తున్న ప్రాజెక్టుల గురించి  అబ్‌డేట్స్‌ ఇస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగగ్రామ్‌ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన అనసూయ పలు విషయాలపై చర్చించింది. ఈ సందర్భంగా 'మీకు తెలిసిన ఐదు హెల్త్‌ టిప్స్‌ మాతో పంచుకుంటారా' అని ఓ అభిమాని అడగ్గా.. వెంటనే ఆ డైట్‌ చార్ట్‌ని బయటపెట్టేసింది.'అందులో మొదటిది గోరువెచ్చని నీళ్లు తాగడం, ఆ తర్వాత ప్రాణాయామం చేయాలి. ఏదైనా తిన్న తర్వాత ఖాళీగా కూర్చోకుండా 30 నిమిషాల్లో ఏదో ఒక పని చేయాలి.

రాత్రి భోజనం ఏడున్నర లోపు తీసుకోవాలి. ఇక చివరిది ఎంతో ముఖ్యమైనది...మీరు ఏదైనా పని చేసే ముందు దాన్ని ఎందుకు చేస్తున్నామో ఆలోచించి మొదలుపెట్టండి. అప్పుడు ఎలాంటి బాధలు లేకుండా హ్యాపీగా ఉంటారు అని తెలిపింది. దీంతో అనసూయ అందానికి ఈ హెల్త్‌ టిప్సేకారణమంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం మలయళంలో డెబ్యూ మూవీ చేస్తున్న అనసూయ దానికి సంబంధించిన లుక్‌ను ఇప్పుడే రివీల్‌ చేయలేనని పేర్కొంది. అంతేకాకుండా మరో మూడు భాషల్లో సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించింది.అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఓ మూవీలో స్క్రీన్ షేర్‌ చేసుకున్నానని,  ఇందుకు సంబంధించిన అబ్‌డేట్స్‌ని త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొంది. 

చదవండి : అర్ధరాత్రి 2 గంటలకు తాగి ఉన్నా: అనసూయ
షూటింగ్‌ : అలాంటి సీన్లు చేయడానికి నో పర్మిషన్


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు