సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన యాంకర్‌ భార్గవి

12 Aug, 2021 21:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌, నటి గాయత్రి భార్గవి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో వెంటనే ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని దుండగులు తన ఫేస్‌బుక్‌ పేజీని హ్యాక్‌ చేసి వివిధ మతాలకు సంబంధించి అభ్యంతకరమైన పోస్టులు చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఈ అంశంపై మాట్లాడిన ఏసీపీ కె. వి. ఎం. ప్రసాద్‌.. యాంకర్‌ భార్గవి ఎఫ్‌బీ అఫీషియల్‌ అకౌంట్‌తో పాటు మరో అకౌంట్‌ను దుండగులు ఆమె పేరు మీద క్రియేట్‌ చేసినట్లు గుర్తించామన్నారు. సోషల్‌ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పకప్పుడు పాస్‌ వర్డ్స్‌ను మార్చుకోవాలని సూచించారు. యాంకర్‌ భార్గవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 

A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi)

మరిన్ని వార్తలు