Anchor Jhansi Manager Death: జీవితం నీటిబుడగలాంటిది, మాటలు రావడం లేదు.. కంటతడి పెట్టిస్తున్న యాంకర్‌ ఝాన్సీ పోస్ట్‌

8 Nov, 2023 08:53 IST|Sakshi

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏ పని చేయాలన్నా మేనేజర్ల మీదే ఆధారపడుతుంటారు. వారి కాల్షీట్లు, సినిమాలు, రెమ్యునరేషన్‌.. ఇలా అన్నీ మేనేజర్లే చూసుకుంటూ ఉంటారు. మేనేజర్‌ ఓకే అన్నాకే ఆయా ప్రాజెక్టులో భాగమవుతారు. మేనేజర్లకు సెలబ్రిటీలకు మధ్య మంచి అనుబంధమే కొనసాగుతుంది. తాజాగా యాంకర్‌ ఝాన్సీ మేనేజర్‌ శ్రీను మరణించాడు. దీంతో యాంకర్‌ ఎమోషనలైంది.

ఎంతో సమర్థవంతుడు
శ్రీను.. ముద్దుగా సీను బాబు అని పిలుచుకుంటాను. నాకు అతడే పెద్ద సపోర్ట్‌ సిస్టమ్‌. హెయిర్‌ స్టయిలిష్ట్‌గా ప్రయాణం ప్రారంభించిన అతడు నాకు వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా మారాడు. నా పనులన్నింటినీ ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు. అతడే నా రిలీఫ్‌. నన్ను బ్యాలెన్స్‌గా ఉంచాడు. అతడే నా బలం. తను ఎంతో మంచివాడు, సహృదయుడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. అతడు నా దగ్గర పనిచే స్టాఫ్‌ మాత్రమే కాదు నా కుటుంబసభ్యుడు.

మాటలు రావడం లేదు
నా తమ్ముడి కంటే ఎక్కువే. నా కుటుంబానికి కూడా ఎంతో కావాల్సినవాడు. 35 ఏళ్లకే గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త నన్ను ఎంతో బాధకు గురి చేసింది. మాటలు రావడం లేదు. జీవితం నీటిబుడగలాంటిది అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. ఈ పోస్ట్‌పై సెలబ్రిటీలు, అభిమానులు స్పందిస్తూ యాంకర్‌ ఝాన్సీ మేనేజర్‌ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. 35 ఏళ్లకే గుండెపోటు ఏంటి? దేవుడు ఎందుకిలా చేస్తున్నాడు? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

A post shared by @anchor_jhansi

చదవండి: అర్జున్‌ చేతుల మీదుగా భార్యకు సీమంతం.. సీక్రెట్స్‌ చెప్పిన ఆ ముగ్గురు.. గుండె బరువెక్కడం ఖాయం!

మరిన్ని వార్తలు