కరోనాకు ముందే రవికి ఆ అలవాటు ఉంది : లాస్య

3 May, 2021 11:39 IST|Sakshi

బుల్లితెరపై యాంకర్‌ రవి-లాస్య జోడీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 'సమ్‌థింగ్‌ స్పెషల్'‌ అనే  ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ జోడీ కొన్ని కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా టామ్‌ అండ్‌ జెర్రీలా కలిసున్న వీరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసిపోయారు. దీంతో మరోసారి ఆన్‌స్ర్కీన్‌పై రవి-లాస్య సందడి చేస్తున్నారు.

ఒకానొక దశలో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇంకెప్పుడో కలిసి షోలు చేయం అని భీష్మించుకున్న ఈ జంట కొందరు మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ద్వారా మళ్లీ కలిసారు. దీంతో ఈ జోడీకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని స్పెషల్‌ ఈవెంట్లు ప్లాన్‌ చేస్తున్నారు షో నిర్మాతలు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి-లాస్య తామిద్దరం మళ్లీ ఎలా కలిశారు? అప్పుడు నెలకొన్న పరిస్థితులు సహా పలు విషయాలపై చర్చించారు. ఈ క్రమంలోనే రవికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను లాస్య బయటపెట్టేసింది.

సోషల్‌ మీడియా, ఫోన్‌, శానిటైజర్‌..ఈ మూడు లేకుండా రవి బతకలేడని, ఎక్కడకి వెళ్లినా ఈ మూడు తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాకుండా ఇప్పుడైతే కరోనా సమయమని అందరం చాలా ఎక్కువగా శానిటైజర్‌ వాడుతున్నామని, అయితే రవి మాత్రం కరోనాకు ముందు నుంచే శానిటైజర్‌ వాడే అలావాటుందని పేర్కొంది. తన కారులో ఎప్పుడూ ఓ శానిటైజర్‌ బాటిల్‌ ఉంటుందని, ఏదైనా ముట్టుకుంటే వెంటనే శానిటైజర్‌ రాసుకుంటాడని తెలిపింది. 

చదవండి : లాస్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్‌ రవి
పెళ్లి కాలేదని చెప్పి..వేరే అమ్మాయిలతో నటుడి ఎఫైర్స్‌

మరిన్ని వార్తలు