ఒక్క రూపాయి అయినా పంపండి ప్లీజ్: యాంకర్‌ రష్మీ

18 Aug, 2021 11:51 IST|Sakshi

బుల్లితెర యాంక‌ర్‌గాను, వెండితెర‌పై క‌థానాయిక‌గాను తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ ర‌ష్మీ గౌత‌మ్. ఇటీవల సోష‌ల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ నెటిజన్లతో కమ్యూనికేట్ అవుతోoది ర‌ష్మీ. తాజాగా ఈ భామ సోష‌ల్ స‌ర్వీస్‌ కోసం తన అభిమానులకు ఓ అభ్య‌ర్ధ‌న చేసింది.

నెల రోజుల క్రితం ఓ కుక్క ఆరో అంత‌స్తు నుంచి కింద ప‌డి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం చికిత్స‌కు రోజుకి 300-400 రూపాయల వరకు ఖర్చవుతుంది. అది తిరిగి నడిచేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అయితే ఆ కుక్క‌కి అప్ప‌టి వ‌ర‌కు చికిత్స అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. అందరు చేస్తే ఆ సాయం పెద్దదిగా మారుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నట్లు తెలిపింది. తన్ ఇన్‌స్టాలో ఫాలోవర్స్  30 లక్షల మందికి పైగానే ఉన్నారు. మీరందరూ ఒక్కొక్కరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు. అది చాలా పెద్ద‌ సహాయంగా మారి దానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపింది. త‌న ఇన్‌స్టా ద్వారా డొనేట్ చేయాల్సిన లింక్‌ని కూడా షేర్ చేసింది. ర‌ష్మీ చేస్తున్న ఈ పనికి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు

చదవండి: భార్యతో విడాకులు.. డిన్నర్‌ కోసం పొద్దున వెళ్లి తలుపులు కొట్టగా.. 

మరిన్ని వార్తలు