చీటింగ్‌ కేసు : వీడియో రిలీజ్‌ చేసిన యాంకర్‌ శ్యామల భర్త

30 Apr, 2021 13:09 IST|Sakshi

నాపై తప్పుడు కేసు పెట్టారు : నర్సింహా రెడ్డి

రెండు రోజుల్లో మీ ముందుకు వస్తా : యాంకర్‌ శ్యామల భర్త

ఓ మహిళ నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు నుంచి బెయల్‌పై బయటకు వచ్చిన నర్సింహారెడ్డి తనపై సోషల్‌ మీడియాలో వస్తోన్న కథనాలపై స్పందించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, మరో రెండు రోజుల్లో నిజనిజాలేమిటో అందరికి తెలుస్తుందని చెప్పారు. 'నాకు చట్టాలు, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది. నాపై పెట్టింది తప్పుడు కేసేనని నిరూపించడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. రెండు రోజుల్లో అన్ని సాక్షాలతో మీ ముందుకు వస్తాను.

అప్పుడు మీకే తెలుస్తుంది నాపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారని. కొన్నిసార్లు మనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. వీటిలో నిజనిజాలేంటో ఫ్రూవ్‌ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. ఇప్పటిదాకా నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు' అంటూ నర్సింహారెడ్డి సోషల్‌ మీడియాలో ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. కాగా 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటీ రూపాయలు తీసుకున్న నర్సింహారెడ్డి ఇప్పటిదాకా తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, లైంగిక వేధింపులకు కూడా గురిచేశాడని తెలిపింది.కాగా ఇదే విషయంపై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది. మహిళా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించిన సంగతి తెలిసిందే. కాగా బెయల్‌పై విడుదలైన నర్సింహారెడ్డి తాజాగా తనపై పెట్టింది తప్పుడు కేసంటూ వీడియోలో పేర్కొన్నాడు. 

చదవండి : మహిళ ఫిర్యాదు.. యాంకర్‌ శ్యామల భర్త అరెస్ట్‌
'బిగ్‌బాస్‌ తర్వాత అందుకే మాకు ఛాన్సులు రాలేదు'

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు