యాంకర్‌ శ్యామల, క్రికెటర్‌ భువనేశ్వర్‌ అక్కాతమ్ముళ్లా?

8 May, 2021 09:31 IST|Sakshi

టాలీవుడ్‌ యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.  టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్‌లో యాంకరింగ్‌ చేస్తుంటుంది. ఇటీవల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్‌ కేసుతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని నర్సింహారెడ్డిపై ఓ మహిళ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, వేధింపులకు కూడా గురిచేశాడని ఆరోపించింది.

తాజాగా ఈ కేసు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నర్సింహారెడ్డి తనపై సోషల్‌ మీడియాలో వస్తోన్న కథనాలపై స్పందిస్తూ.. తనపై తప్పుడు కేసు పెట్టారని, త్వరలో నిజనిజాలేమిటో అందరికి తెలుస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా శ్యామలకు క్రికెటర్‌ భువనేశ్వర్‌కు మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో తెలుసా అంటూ కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు అక్కా, తమ్ముళ్లని అందుకే వీరిద్దరికి దగ్గరి పోలికలుంటాయని మీమ్స్‌ క్రియేట్‌ చేశారు. తాజాగా ఈ వార్తలపై స్పందించిన శ్యామల.. ‘అవునా.. ఈ విషయం నాకే తెలియదు వాళ్లకేం తెలుస్తుంది’ అంటూ సెటైర్‌ వేశారు. దీంతో శ్యామల, భువనేశ్వర్‌ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ అంటూ వైరలవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. 

చదవండి : 
చీటింగ్‌ కేసు : వీడియో రిలీజ్‌ చేసిన యాంకర్‌ శ్యామల భర్త

మహిళ ఫిర్యాదు.. యాంకర్‌ శ్యామల భర్త అరెస్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు