శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్‌’ విడుదల తేదీ వచ్చేసింది

13 Aug, 2021 07:56 IST|Sakshi

శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. ఈ. సత్తిబాబు దర్శకుడిగా వహించిన ఈ సినిమాను బొడ్డు అశోక్‌ నిర్మిస్తున్నాడు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన శ్రేయాస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కామెడీ జానర్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం. అయితే పెద్ద సినిమాలు ఉండటంతో వాయిదా వేశాం. ఆ తర్వాత మేలో లాక్‌డౌన్‌ వచ్చింది. ఫైనల్‌గా ఈ నెలలో రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన మా సినిమా టైటిల్‌ సాంగ్‌ మంచి స్పందన వచ్చింది. రఘు కుంచె స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా.. శ్రీముఖి తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది’ అని చెప్పుకొచ్చాడు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు