Anchor Sreemukhi: కొత్త ఇల్లు కొన్న యాంకర్‌ శ్రీముఖి.. ఘనంగా గృహప్రవేశం

15 Dec, 2022 11:39 IST|Sakshi

యాంకర్‌ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్‌ అవసరం లేదు. బుల్లితెరపై టాప్‌ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అందంతో పాటు చలాకీతనంతో స్టార్‌ యాంకర్‌గా దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో ఏ షో చూసినా హోస్ట్‌గా ఎక్కువగా శ్రీముఖినే కనిపిస్తుంది. పలు టీవీ ఛానెళ్లలో తనదైన యాంకరింగ్‌తో ఆకటుకుంటున్న శ్రీముఖికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా బాగానే ఉంది. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేసింది.


కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకోవడంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక  ఓవైపు యాంకరింగ్‌గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై కూడా సందడి చేస్తున్న శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్‌ సినిమాలో నటిస్తుంది.  

A post shared by Sreemukhi (@sreemukhi)


 

మరిన్ని వార్తలు